UN వేదికపై తమిళుల ఘనత.. సతీష్ కుమార్‌కు అరుదైన గౌరవం! | Sathish Kumar Takes Tamil Heritage To The Global Stage At The UN, Highlighting Ancient Engineering And Sustainable Traditions | Sakshi
Sakshi News home page

UN వేదికపై తమిళుల ఘనత.. సతీష్ కుమార్‌కు అరుదైన గౌరవం!

Oct 5 2026 3:53 PM | Updated on Oct 5 2026 4:25 PM

Sathish Kumar Takes Tamil Heritage to the Global Stage at the UN

చెన్నైకి చెందిన డీఏసీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ సంతానంకు 2026 గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డు దక్కింది. ఐక్యరాజ్యసమితిలో జరిగిన రెండో సమ్మిట్‌లో ఆయనకు ఈ గౌరవం లభించింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల జీవన విధానం వంటి అంశాలపై ఆయన మాట్లాడారు.

తన ప్రసంగంలో సతీష్ కుమార్ సంతానం.. తమిళనాడుకు చెందిన చారిత్రక నిర్మాణాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన కల్లణై ఆనకట్టను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన అద్భుతమైన ఇంజినీరింగ్‌కు ఉదాహరణగా చెప్పారు. అలాగే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం తమిళుల నిర్మాణ నైపుణ్యం, శాస్త్రీయ పరిజ్ఞానం, ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటే గొప్ప వారసత్వంగా వివరించారు.

తమిళుల గొప్ప మానవతా ఆలోచన అయిన ''ప్రపంచమంతా నా స్వగ్రామం, ప్రజలందరూ నా బంధువులు'' అనే భావనను కూడా ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతం మనదే, ప్రతి మనిషి మనవాడే అనే ఈ ఆలోచన నేటి ప్రపంచంలో కూడా ఎంతో అవసరమని చెప్పారు. ప్రకృతితో కలిసి జీవించడం, నీటిని కాపాడుకోవడం, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించడం, ఆహార భద్రతను పెంచడం వంటి అంశాలపై కూడా ఆయన మాట్లాడారు.

ఈ అంశాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన సతీష్ కుమార్ సంతానంకు డా. జియోవన్నీ జింగ్ చేతుల మీదుగా 2026 గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డు అందించారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన పురాతన నిర్మాణాలు, ఇంజినీరింగ్ ప్రతిభ గురించి ఆయన చేసిన ప్రస్తావన అక్కడి వారిని ఎంతో ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement