న్యూఢిల్లీ: డిజిటల్ సరీ్వసుల రిలయన్స్ గ్రూప్ దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ నెల 12కల్లా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తుది ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి పొందగా.. దసరా పండుగ తదుపరి 23కల్లా పబ్లిక్ ఇష్యూ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపును ప్రకటించవచ్చని పేర్కొన్నాయి. వెరసి ఈ నెలాఖరులోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు రెడీకానున్నట్లు పేర్కొన్నాయి.
సెబీకి తొలుత జూన్‌లో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసి ఆగస్ట్ 28న అనుమతి పొందిన సంగతి తెలిసిందే. 3.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 36,500 కోట్లు) సమీకరణకు ఐపీవో చేపట్టనున్నట్లు అంచనా. తద్వారా కంపెనీ విలువ 146 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 14 లక్షల కోట్లు)గా నమోదుకావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. ఈ నెల 12 నుంచి దేశీయంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో సంబంధిత రోడ్ షోలు ప్రారంభంకానున్నట్లు అభిప్రాయపడ్డాయి.


