కియా వారి నయా కారు: రేటెంతో తెలుసా? | Kia Sorento Launched in India Know The Price Features and More | Sakshi
Sakshi News home page

కియా వారి నయా కారు: రేటెంతో తెలుసా?

Sep 4 2026 3:03 PM | Updated on Sep 4 2026 3:03 PM

Kia Sorento Launched in India Know The Price Features and More

కియా మోటార్స్ భారతదేశంలో కొత్త సోరెంటో ఎస్‌యూవీని రూ.27.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న కియా సోరెంటో 6 సీటర్, 7 సీటర్ రూపంలో అందుబాటులో ఉంది. ఇది 4,815 మిమీ పొడవు, 1,900 మిమీ వెడల్పు, 1,785 మిమీ ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,815 మిమీ వరకు ఉంటుంది.

కియా సోరెంటో నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్‌లు, టైగర్-నోస్ గ్రిల్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగం కూడా ముందు భాగాన్ని పోలి ఉండేలా నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది మొత్తం 8 రంగులలో లభిస్తుంది.

సరికొత్త కియా సోరెంటో 4 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ లేదా దానికి సరిపోయే 12.3-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే పొందుతుంది. కియా కనెక్ట్ 2.0, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్‌ప్లే, జనరేటివ్-AI అసిస్టెంట్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కాకుండా.. వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ రో సీట్లు, 10-వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు, ముందు ప్రయాణీకుడి సీటు కోసం పవర్ అడ్జస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, 12-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్ వంటికి ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 26-ఫీచర్ల భద్రతా ప్యాకేజీ ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్స్ పది ఎయిర్‌బ్యాగ్‌లు, 28 వరకు భద్రతా ఫీచర్లను పొందుతాయి. ఇందులో లెవెల్ 2+ ఏడీఏఎస్, సరౌండ్-వ్యూ, బ్లైండ్-వ్యూ మానిటర్లు, రిమోట్ పార్కింగ్ అసిస్టెన్స్, డిజిటల్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ ఉన్నాయి.

కియా సోరెంటో అనేది స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ఆల్-వీల్ డ్రైవ్‌ పొందిన కియా ఇండియా మొదటి మోడల్. ఇది డీజిల్ ఇంజన్‌ను కూడా అందిస్తుంది. హైబ్రిడ్ వెర్షన్‌లో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్‌ లభిస్తుంది. ఇంజన్ 180 హార్స్ పవర్ ఉత్పత్తి చేయగా, ఎలక్ట్రిక్ మోటార్ 65 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండింటి సంయుక్త అవుట్‌పుట్ 238హార్స్ పవర్. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 265 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement