కొత్త బిజినెస్‌లోకి ఆదిత్య బిర్లా | Aditya Birla Group Enters Cables and Wires Business | Sakshi
Sakshi News home page

కొత్త బిజినెస్‌లోకి ఆదిత్య బిర్లా

Sep 5 2026 4:44 PM | Updated on Sep 5 2026 4:55 PM

Aditya Birla Group Enters Cables and Wires Business

ముంబై: డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఆదిత్య బిర్లా(ఏబీ) గ్రూప్‌ తాజాగా కేబుళ్లు, వైర్ల బిజినెస్‌లోకి ప్రవేశించింది. అ్రల్టావోల్డ్‌ బ్రాండుతో కొత్త బిజినెస్‌ను ప్రారంభించినట్లు గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఇందుకు రూ. 1,800 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

వెరసి గ్రూప్‌ మూడో పెద్ద బిజినెస్‌లోకి అడుగు పెట్టినట్లు తెలియజేశారు. ఏబీ గ్రూప్‌ ఇటీవల పెయింట్లు, బీటూబీ ఈకామర్స్, రిటైల్‌ జ్యువెలరీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాగా.. కేబుళ్లు, వైర్ల విభాగంలో లీడర్‌గా ఎదిగే ప్రణాళికలతోనే బిజినెస్‌కు శ్రీకారం చుట్టినట్లు బిర్లా తెలియజేశారు. అల్యూమినియం, కాపర్‌ విభాగాలలో తమకున్న లోతైన నైపుణ్యం.. ప్రొడక్టుల నాణ్యత, పనితీరు, నిలకడకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.

దేశీయంగా సిమెంట్‌ తయారీలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న అ్రల్టాటెక్‌ మూడో వంతు గృహాలను నిర్మించినట్లు కొత్త బిజినెస్‌ ప్రారంభం సందర్భంగా ప్రస్తావించారు. కేబుళ్లు, వైర్ల తయారీ వ్యయాలలో కాపర్, అల్యూమినియం వాటా 80 శాతమని, దీనికితోడు సిమెంట్‌లోనూ కార్యకలాపాలు అ్రల్టావోల్ట్‌ పురోభివృద్ధికి సహకరించగలవని ఏబీ గ్రూప్‌ డైరెక్టర్‌ దిలీప్‌ గౌర్‌ వివరించారు. తద్వారా ప్రత్యర్థులకంటే ముందుగానే బిజినెస్‌ అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement