హెచ్‌ఎఫ్‌సీఎల్‌ రూ. 950 కోట్ల పెట్టుబడులు | HFCL To Invest ₹950 Crore To Expand Optical Fiber Manufacturing And Targets 10% Global Market Share | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎఫ్‌సీఎల్‌ రూ. 950 కోట్ల పెట్టుబడులు

Jul 9 2026 9:35 AM | Updated on Jul 9 2026 9:55 AM

HFCL To Invest Rs 950 Crore In Optical Fibre Cable Manufacturing Capacities

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే రెండేళ్లలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై రూ. 950 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు టెలికం ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్‌ఎఫ్‌సీఎల్‌ ఎండీ మహేంద్ర నహతా తెలిపారు. ఇందులో రూ. 580 కోట్లను సిలిండ్రికల్‌ గ్లాస్‌ రాడ్‌లు మొదలైన ముడి వస్తువుల కోసం వెచి్చంచనున్నట్లు తెలంగాణలోని ప్లాంటు సందర్శన సందర్భంగా చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో అంతర్జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ సెగ్మెంట్లో 10% వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. 

గత ఏడాది సంస్థ ఆర్డర్‌ బుక్‌ రూ. 9,967 కోట్ల నుంచి రూ. 21,206 కోట్లకు ఎగిసినట్లు తెలిపారు. మరోవైపు తమ సమగ్ర ఆప్టికల్‌ కనెక్టివిటీ పోర్ట్‌ఫోలియోకి సంబంధించి ’ఆప్టిక్‌ ఏఐ’ బ్రాండ్‌ ఐడెంటిటీని ఆవిష్కరించారు. ప్రస్తుతం 14 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఏఐ ఆప్టికల్‌ మార్కెట్‌.. 2030 నాటికి 73 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని నహతా చెప్పారు.  
బుధవారం హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేరు సుమారు 
5 శాతం క్షీణించి రూ. 215 వద్ద క్లోజయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement