ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ అన్మోల్‌ అక్షయ ప్లాన్‌ | Aditya Birla Sun Life Insurance launches Anmol Akshaya | Sakshi
Sakshi News home page

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ అన్మోల్‌ అక్షయ ప్లాన్‌

Jun 15 2026 1:10 AM | Updated on Jun 15 2026 1:10 AM

Aditya Birla Sun Life Insurance launches Anmol Akshaya

ముంబై: జీవిత బీమా రక్షణతోపాటు, భవిష్యత్‌ లక్ష్యాల కోసం పొదుపు ప్రయోజనాలతో ‘ఏబీఎస్‌ఎల్‌ఐ అన్మోల్‌ అక్షయ’ ప్లాన్‌ను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏబీఎస్‌ఎల్‌ఐ) ప్రారంభించింది. తమ పిల్లల విద్యావసరాలకు ఉపయోగపడే విధంగా జీవితంలోని వివిధ దశల్లో చెల్లింపులు చేసే ‘మై చైల్డ్‌’ను ఎంపిక చేసుకోవచ్చు.

కుమార్తె వివాహం, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్‌ తదితర జీవిత లక్ష్యాలకు సంబంధించి మధ్య, దీర్ఘకాలంలో కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు వీలుగా ‘మై సేవింగ్స్‌’ ఆప్షన్‌ కూడా ఈ ప్లాన్‌లో ఉంది. మహిళా పాలసీదారులకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ‘హర్‌ బెనిఫిట్స్‌’ కింద.. భవిష్యత్తు లక్ష్యాలకు పొదుపు చేసుకోవచ్చు. డాక్టర్‌ కన్సల్టేషన్లు, ఆరోగ్యంపై కోచింగ్, రెండో మెడికల్‌ (డాక్టర్‌) ఒపీనియన్‌ తదితర సేవలను పొందొచ్చు.

తమ అవసరాలకు అనుగుణంగా బీమా కవరేజీని పెంచుకునే ‘ఎక్స్‌టెండెడ్‌ లైఫ్‌ కవర్‌ (ఈఎల్‌స్‌)’ను కావాల్సిన వారు ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా 75 లేదా 85 ఏళ్ల వరకు బీమా రక్షణ కొనసాగుతుంది. ఒకవేళ పాలసీదారుడు కాల వ్యవధిలోపు మరణించినట్టయితే, ఒకే విడత పరిహారం అందించి.. మెచ్యూరిటీ అయిన తర్వాత మిగిలిన పాలసీ ప్రయోజనాలు అందించే ఆప్షన్‌ కూడా ఉంది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement