తమిళనాడు ఎన్నికలు.. హీరోయిన్‌కు చేదు అనుభవం | Kollywood Actress Akshaya Hariharan Bad Experience at Voting In Tamilnadu | Sakshi
Sakshi News home page

Akshaya Hariharan: ఓటు వేసేందుకు వెళ్లిన హీరోయిన్‌కు షాక్

Apr 23 2026 6:04 PM | Updated on Apr 23 2026 7:06 PM

Kollywood Actress Akshaya Hariharan Bad Experience at Voting In Tamilnadu

ప్రముఖ నటి అక్షయ హరిహరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్‌కు గురైంది. అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్‌ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని కోరినట్లు అక్షయ హరిహరన్ తెలిపింది. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరింది. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన ఓటు వేసేందుకు వచ్చిన సెలబ్రిటీకి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా.. అక్షయ హరిహరన్ తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. సబా నాయగన్, రంగోలి, బ్లడీ బగ్గర్, హే సినామికా లాంటి సినిమాల్లో మెప్పించింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement