ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్‌, కీలక వ్యాఖ్యలు | Sonu Sood on Delhi building collapse calls for affordable hostels for students | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్‌, కీలక వ్యాఖ్యలు

Sep 8 2026 3:52 PM | Updated on Sep 8 2026 5:07 PM

Sonu Sood on Delhi building collapse calls for affordable hostels for students

Delhi building collapse ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై  బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood)స్పందించారు.  ఏడుగురు విద్యార్థులు  ప్రాణాలు కోల్పోవడంపై  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు సురక్షితమైన వసతి సౌకర్యాలను కల్పించాలని  ఈ సందర్భంగా సోనూ సూద్‌  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని భవనంలో సరైన నిబంధనలు పాటించకుండా ఇరుకైన స్థలాల్లో నిర్మించిన ప్రైవేట్ హాస్టల్స్‌ విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా  పరిణమిస్తున్న తీరుకు  ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.  ఈ సందర్భంగా హాస్టళ్ల కొరత, విద్యార్థుల వసతి సౌకర్యాలపై సోనూ సూద్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన గణాంకాలతో  ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ప్రతీ ఏడాది లక్షల మంది విద్యార్థులు తమ కలల సాకారం  కోసం ఇళ్లను వదిలి వేరే నగరానికి తరలిపోతున్నారు. కానీ మనం వారికి భద్రమైన  జీవితాన్నికల్పించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, అందుబాటులో ఉన్న హాస్టల్ సీట్లు కేవలం 30,000 మాత్రమే. అంటే ప్రతి 31 మంది విద్యార్థులలో ఒక్కరికి మాత్రమే హాస్టల్ సౌకర్యం లభిస్తోంది. విశ్వవిద్యాలయాల సమీపంలో ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి విద్యార్థులకు సురక్షితమైన, తక్కువ ధరలోని హాస్టళ్లను నిర్మించాలని ఆయన సూచించారు. క్యాంపస్ పరిధిలోనే మరిన్ని వసతి గృహాలు కట్టడానికి విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్‌ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్‌!

విద్యార్థులకు భద్రత,  తల్లిదండ్రులకు మనశ్శాంతి లభిస్తుంది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు ఆదాయాన్ని పొందుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, మనం బిడ్డల ప్రాణాలు భద్రంగా ఉంటాయని ట్వీట్‌ చేశారు.  చిన్న విధానపరమైన మార్పులు అనేకమంది విద్యార్థుల ప్రాణాలను, వారి కలలను కాపాడగలవని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సౌండ్‌ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు

కాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదిగ్భ్రాంతిరేపింది.  ప్రమాదానికి కారణమైన భవన యజమాని హరిరామ్ గుప్తా, ఆయన భార్య ఊర్మిళ గుప్తాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారి కుమారుడు మహేష్ గుప్తాను రెండు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ప్రమాదం జరిగిన భవనానికి ఆనుకుని ఉన్న మరొక భవనం కూడా ప్రమాదకరంగా మారిందని, దానిని కూల్చివేయనున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా  వెల్లడించారు.

ఇదీ చదవండి: నో జిమ్‌, సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement