ఒలంపియా జిమ్‌ : బౌన్సర్లు కేరాఫ్‌ జైపూర్‌ | Most experienced gym Now in Jaipur check deets inside | Sakshi
Sakshi News home page

ఒలంపియా జిమ్‌ : బౌన్సర్లు కేరాఫ్‌ జైపూర్‌

Sep 8 2026 4:15 PM | Updated on Sep 8 2026 4:20 PM

Most experienced gym Now in Jaipur check deets inside

జైపూర్‌: బౌన్సర్‌ అంటే కేవలం కండలు తిరిగిన శరీరం కాదు.. క్రమశిక్షణ, అప్రమత్తత, బాధ్యతకు ప్రతిరూపం. షాపింగ్‌ మాల్స్‌ నుంచి ఫంక్షన్‌ హాళ్ల వరకు.. ప్రముఖుల కార్యక్రమాల నుంచి భారీ ఈవెంట్ల వరకు ఎక్కడ జన సందోహం ఉంటే అక్కడ వీరి విధులు కనిపిస్తాయి. అలాంటి బౌన్సర్లను తీర్చిదిద్దుతూ గ్రామీణ యువతకు ఉపాధి బాట చూపుతోంది జైపూర్‌ మండలం రసూల్‌పల్లిలోని ఒలంపియా జిమ్‌ (Olympia Gym). వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు..అదే ఫిటెనెస్‌ను ఉపాధిగా మలుచుకుంటున్న యువతకు ఈజిమ్‌ అడ్డాగా మారుతోంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది యువకులు పట్టణ ప్రాంతాల్లో బౌన్సర్లుగా విధులు నిర్వహిస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఉద్యోగం చేస్తూనే
ఒలంపియా జిమ్‌లో శిక్షణ పొందుతున్న వారంతా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేసూ్తనే బౌన్సర్‌గా వి«ధులు నిర్వహిస్తున్నారు. తమకు లభించే ఖాళీ సమయాన్ని జిమ్‌లో వ్యాయామానికి కేటాయిస్తూ ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తున్నారు. యువతలో శారీరకధారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. 

వ్యసనాలకు దూరంగా..
యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలన్నదే లక్ష్యం. జిమ్‌ ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ, శారీరక సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తాంఅంటున్నా ఒలంపియా జిమ్‌ నిర్వాహకుడు ప్రవీణ్‌. 

ఇదీ చదవండి: ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్‌, కీలక వ్యాఖ్యలు

15 ఏళ్ల క్రితం మొదలై..
రసూల్‌పల్లికి చెందిన కుమ్మరి ప్రవీణ్‌ 15 ఏళ్ల క్రితం ఒలంపియా జిమ్‌ను ఏర్పాటు చేశాడు. మొదట చిన్నస్థాయిలో ప్రారంభమైన ఆయన ప్రయత్నం క్రమంగా విస్తరించి ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలో రెండు, చెన్నూర్‌లో రెండు, రసూల్‌పల్లిలో ఒకటి మొత్తంగా ఐదు బ్రాంచ్‌ల వరకు చేరింది. జిమ్‌లో వ్యాయామంతో పాటు శారీరక ధారుఢ్యం, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌పై యువతకు శిక్షణ ఇస్తున్నారు. 

ప్రస్తుతం సుమారు 40 మంది యువకులు, 10 మంది యువతులు ఇక్కడ శిక్షణ పొందుతూ హైదరాబాద్, సూర్యాపేట, సిద్దపేట, వరంగల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, బెంగళూర్‌ వంటి పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాల్లో రద్దీని నియంత్రించడం, ప్రవేశ మార్గాలను క్రమబద్ధీకరించడం, ప్రముఖులు, నిర్వాహకులకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు చేపడుతున్నారు. షాపింగ్‌ మాల్స్, ఫంక్షన్‌ హాళ్లు, ప్రైవేట్‌ ఈవెంట్లలో అవసరాన్ని బట్టి భద్రతా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement