‘అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా ఫోన్‌ చేయండి’ | Vizianagaram:YSRCP Leader Botsa chairs Party social media workers meet | Sakshi
Sakshi News home page

‘అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా ఫోన్‌ చేయండి’

Sep 11 2026 5:27 PM | Updated on Sep 11 2026 5:42 PM

Vizianagaram:YSRCP Leader Botsa chairs Party social media workers meet

విజయనగరం:  కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్‌ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్‌ 11వ తేదీ) విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలతో బొత్స సమావేశమయ్యారు.  ఈ మేరకు సోషల్‌ మీడియా కార్యకర్తలకు బొత్స దిశా నిర్దేశం చేశారు. 

‘ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్‌ మీడియా వేదికగా ఎండగట్టాలి. చట్ట వ్యతిరేకమైన పోస్టులకు, అబద్ధపు ప్రచారాలకు దూరంగా ఉండాలి.ఇక మీదట ప్రతి కార్యకర్త నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో అనుసంధానం కావాలి. నేను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను.. ఏ సమయంలోనైనా ఫోన్‌ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:
పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement