పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత | Police Stop YSRCP Leaders From Visiting Pothireddypadu Sparking Tension | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత

Sep 11 2026 3:59 PM | Updated on Sep 11 2026 4:22 PM

Police Stop YSRCP Leaders From Visiting Pothireddypadu Sparking Tension

నంద్యాల:  జిల్లాలోని పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జూపాడు బంగ్లా సమీపంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద 9వ గేటు ఎత్తుతుండగా రోప్ తెగిపోయి గేటు కింద పడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ పరిశీలనకు వైఎస్సార్‌సీపీ నేతలు అక్కడకు బయల్దేరి వెళ్లారు. 

.అయితే వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేసి మరీ అడ్డుకున్నారు పోలీసులు. మీడియాను సైతం అనుమతించలేదు. ప్రభుత్వం డొల్లతన బయటపడుతుందనే అక్కడకు వెళ్లిన తమను అడ్డకున్నారని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. 

కాగా, శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసే సమయంలో పోతిరెడ్డిపాడు తొమ్మిదో నెంబరు ఐరన్‌ గేటుకు సంబంధించిన రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. గేట్లు ఎత్తుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో గేటు ఊడిపోయి కింద పడిపోయింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది. 

ఇదీ చదవండి:
మధ్యాహ్న భోజనం ఇంత అధ్వానమా?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement