సాక్షి, తెలంగాణ: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న రెండు ఏటీఎంలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రెండు ఏటీఎం మెషిన్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మంటలు మరింతగా వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: మా భూములు గుంజుకుంటారా?


