ఢిల్లీ : ఈ నెలాఖరుకు పార్టీ పదవులు, కార్పొరేషన్లు, డైరెక్టర్లు, డిసీసీ బ్యాంక్ చైర్మన్లు, డీసీసీ పదవులు భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలను పంచుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ క్రమంలోనే తన మంత్రి పదవి గురించి కూడా కాస్త భిన్నంగా స్పందించారాయన. తనను ఎవరూ మంత్రి పదవి తీసుకోమని ఎవరూ అడగలేదని, అయినా మంత్రి పదవి కంటే పీసీసీ పదవే పెద్దదే అంటూ సరదాగా వ్యాఖ్యానించారు మహేష్‌గౌడ్.
‘వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా నలుగురిని నియమిస్తాం. ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ, జనరల్ కేటగిరీలకే ప్రాధాన్యత. తెలంగాణ ఇంచార్జ్ ఎవరినేది అధిష్టానం నిర్ణయం. ఇచ్చిన హామీలు అమలు చేస్తాము....8 లక్షల కోట్లకు అప్పు కడుతున్నాం. కేటీఆర్ వాళ్ళ తాతలు ఇచ్చిన భూమి అంటున్నారు చూపెట్టండి. ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత లెక్కలు అఫిడవిట్ లో చూపెట్టాలి.
రాజకీయాలను వ్యాపారం చేస్తామంటే జనం అన్ని గమనిస్తున్నారు. అందరూ కూడా ప్రజా రాడార్‌లో ఉన్నారు. కాంగ్రెస్ దళితులను రాష్ట్ర పతులను,కేంద్రమంత్రులు చేసింది. ఇందిరాగాంధీ కోరుకున్నదే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దళితులకు భూములు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ నేతల ప్రాపర్టీ ఉంటే బయట పెట్టండి.. చర్యలు ఉంటాయి. 2014 నుంచి 2025 వరకు భూ దోపిడి జరిగింది. 22ఏ కారణంగా ఎవరు ఇబ్బంది పడొద్దు అది పార్టీ పాలసీ’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ


