సాక్షి, హైదరాబాద్: ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ‘సర్’ ప్రక్రియలో జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి కొత్త వెసులుబాటు కల్పించింది. ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు హాజరైతే చాలు. ఫ్యామిలీ మెంబర్‌కు వ్యక్తిగత హాజరుకు అవకాశం ఇచ్చింది. ఈఆర్వో, ఏఈఆర్వోల ఎదుట హాజరై పత్రాలు, సమాచారం అందించే అవకాశం కల్పించింది. కుటుంబ సభ్యుల తరఫున అవసరమైన పత్రాలు సమర్పించవచ్చని.. నోటీసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలంగాణ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
ఓటర్ల పత్రాలు స్వీకరించి నోటీసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. జిల్లా ఎన్నికల అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చిన ఈసీ.. ఓటర్ల నోటీసులను పరిశీలించి పరిష్కరించాలని సూచించింది. ఫారం-6 దరఖాస్తులపై సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫారం-6 దరఖాస్తులకు డిక్లరేషన్ ఫారం తప్పనిసరి. భవిష్యత్‌లో అందే ఫారం-6 దరఖాస్తులకూ డిక్లరేషన్ ఫారం తప్పనిసరి.
అర్హత తేదీ 1.10.2026 పరిగణనలోకి తీసుకోవాలి. ఫారం-6 పరిశీలన, డిక్లరేషన్ స్వీకరణ, క్లెయిమ్‌ల పరిష్కారానికి ఆదేశాలిచ్చింది. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ.. తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: HYD: ఈ హోటళ్లలో బిర్యానీ తిన్నారా?.. బిగ్ షాక్!


