సాక్షి, నంద్యాల జిల్లా: కొత్తపల్లి మండలం ఎర్రమటం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్య అరిచిందని మనస్థాపానికి గురైన భర్త.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో పెద్ద మద్దిలేటి దక్కించుకున్నారు.
అయితే, ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేవని.. లడ్డూ వేలం మనకు సరికాదని భార్య.. మద్దిలేటికి గట్టిగా అరుస్తూ సర్ది చెప్పగా.. అవమానంగా భావించిన పెద్ద మద్దిలేటి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: రమా నందన కేసులో అసలేం జరుగుతోంది?


