పోరాట ఉధృతికి ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సన్నద్ధం..! | Village and Ward Secretariat employees in AP gear up for agitation | Sakshi
Sakshi News home page

పోరాట ఉధృతికి ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సన్నద్ధం..!

Sep 17 2026 8:20 PM | Updated on Sep 17 2026 8:26 PM

Village and Ward Secretariat employees in AP gear up for agitation

ఫైల్‌ఫోటో

విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. సానుకూలం అంటూ పోరాటం వరకూ తీసుకొచ్చారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చర్చలు విఫలమైతే మాత్రం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం ఖాయమని అంటున్నారు. 

ఈనెల 23వ తేదీన సచివాలయ ఉద్యోగులను మంత్రి చర్చలకు రావాలని పిలిచిన నేపథ్యంలో వారు తమ కార్యాచరణను ముందుగానే ప్రకటించారు. చర్చలు విఫలమైన పక్షంలో పోరాటాన్ని మరింత తారాస్థాయికి తీసుకెళతామని, ఈనెల 25న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందని గ్రామ,వార్డు సచివాయ ఉద్యోగుల జేఎసి హెచ్చరించింది. అదే సమయంలో ఈనెల 27వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటించింది 

ఇదీ చదవండి: బాబు సర్కారుపై ‘మహా’గ్రహం

 

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement