కాకినాడ జిల్లా: పెళ్ళి బస్సును ఢీకొట్టిన కంటైనర్‌ | Container Lorry Hits Wedding Bus At Tuni Tetagunta | Sakshi
Sakshi News home page

కాకినాడ జిల్లా: పెళ్ళి బస్సును ఢీకొట్టిన కంటైనర్‌

Sep 17 2026 5:12 PM | Updated on Sep 17 2026 5:39 PM

Container Lorry Hits Wedding Bus At Tuni Tetagunta

సాక్షి, కాకినాడ జిల్లా: పెళ్లి బృందం బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పెళ్ళి బస్సును కంటైనర్‌ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు.. పల్టీ కొట్టింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగులకొట్టి బయటపడ్డారు.

తుని సమీపంలోని తేటగుంట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పాడకు చెందిన పెళ్లి బృందం తునిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో 65 మందికిపైగా ఉన్నారు. 43 మంది గాయపడగా.. తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement