అనకాపల్లి: ఎంపీ సీఎం రమేశ్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చింతకుంట మునుస్వామి రమేశ్ అంటే ఎవరికైనా తెలుసా? అని అన్నారు. ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని చెప్పారు. చరిత్ర గుర్తెరిగి మాట్లాడితే బాగుండేదని సూచించారు.
అనకాపల‍్లిలో అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘‘1989లో ఒక వార్డుకి ఏజెంట్ గా ఉండే సీఎం రమేశ్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలి. నేనుగానీ నోరు విప్పితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావో నీకే తెలీదు. సీఎం రమేశ్ సారా బుడ్డి సోడాబుడ్డికే పెరిగారు. సీఎం రమేశ్ ఒక రాజకీయ వ్యభిచారి. పగలు బీజేపీతో రాత్రి చంద్రబాబుతో రాజకీయం చేస్తారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో చరిత్ర ఉన్న మా కుటుంబం మీద మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. అధికారం ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది.. ఇప్పుడు సీఎం రమేశ్ పరిస్థితి కూడా అంతే. సీఎం రమేశ్‌లాంటి వారు వస్తుంటారు పోతుంటారు.. గుడివాడ అమర్నాథ్ లోకల్. సీఎం రమేశ్‌ను పంచదారల కొండ అక్రమలు, అవినీతిపై ప్రశ్నించినందుకే విమర్శలు చేస్తున్నారు.
అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేసినందుకే చిల్లర విమర్శలు చేస్తున్నారు. కడపలో నువ్వు చెల్లని రూపాయి కాబట్టే అనకాపల్లికి పంపించారు. సీఎం అంటే కమిషన్ మ్యాన్, చంద్రబాబు మనిషి, చిల్లర మనిషిని అందరూ అంటున్నారు. గోవాడ సూపర్ ఫ్యాక్టరీ రైతుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా, స్థానికంగా రెండు వంతెనలు కూలిపోతే వాటి గురించి పట్టించుకున్నారా? రాజకీయ విమర్శలు తప్ప చేసింది ఏమీ లేదు’’ అని చెప్పారు.
ఇదీ చదవండి: 15 ఏళ్ల తర్వాత గోడను కూలగొడితే లైబ్రరీ బయటపడింది..


