మిన్ను విరిగి మీద పడినా : పెళ్లి ఆగేదే లేదు! | Hours after a Russian attack destroys their home a Ukrainian couple marries anyway | Sakshi
Sakshi News home page

మిన్ను విరిగి మీద పడినా : పెళ్లి ఆగేదే లేదు!

Sep 10 2026 5:20 PM | Updated on Sep 10 2026 5:30 PM

Hours after a Russian attack destroys their home a Ukrainian couple marries anyway

మొన్న వరద నీటిలో కూడా తగ్గేదేలే అంటూ తడి బట్టలతోనే  పెళ్లి వేడుకను ముగించుకున్న జంట కథ గురించి తెలుసుకున్నాం. తాజాగా  మిన్ను విరిగి మీద పడినా, పెళ్లి మాత్రం ఆగేదే లేదు అంటూ ఒక  ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. యుద్ధం తెచ్చిపెట్టిన వినాశనం  నడుమ  ప్రేమ జయించిన ఒక భావోద్వేగ సంఘటన ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌లో చోటుచేసుకుంది. వీరి  ఎమోషనల్‌ వెడ్డింగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

రష్యా దాడిలో తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఉక్రెయిన్ సైనికుడు , అతని భాగస్వామి శిథిలాల నుంచే తమ పెళ్లి దుస్తులను బయటకు తీసి, షెడ్యూల్ ప్రకారమే వివాహం చేసుకున్నారు.  ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వాసి ల్యుడ్మిలా  (33)కు లియోనిడ్‌ రిజాక్‌ (43) లు చాలాకాలంగా కలిసి ఉంటున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్‌స్క్ ప్రాంతంలో బాంబర్ డ్రోన్‌ల విభాగంలో పనిచేస్తున్నాడు రిజాక్‌. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన ముహూర్తం ఖరారైంది కూడా. సరిగ్గా వివాహానికి కొన్ని గంటల ముందు, వారు నిద్రపోతున్న సమయంలో వారి భవనానికి ఎదురుగా ఉన్న వేర్‌హౌస్‌పై రష్యా దాడి జరిగింది. ఈ దాడి ధాటికి అపార్ట్‌మెంట్ కిటికీలు పగిలిపోయాయి, ఫర్నిచర్ చెల్లాచెదురైంది. ల్యుడ్మిలా పగిలిన గాజు ముక్కలు , శిథిలాల కింద నుంచి తన తెల్లటి పెళ్లి లంగాను బయటకు తీయాల్సి వచ్చింది. రెండో దాడి ముప్పు ఉండటంతో, వారు ల్యుడ్మిలా 6 ఏళ్ల కుమార్తెతో కలిసి బంకర్ (షెల్టర్)కు చేరుకున్నారు. దాడి తీవ్రతకు వారు ఉంటున్న ఫ్లాట్ నివాస యోగ్యంగా లేకుండా దెబ్బతింది.

సెప్టెంబర్ 8న జరిగిన ఈ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సైతం వైమానిక హెచ్చరికల (Air-raid sirens) వల్ల వారికీ ఆరు రోజులు పట్టింది. తీరా పెళ్లి రోజున ఉదయం 10:40 గంటలకు రిజిస్టర్ ఆఫీస్‌కు చేరుకునేసరికి మళ్లీ సైరన్ మోగడంతో దాదాపు మూడు గంటల పాటు ఆవరణలోనే వేచి చూడాల్సి వచ్చింది. 

ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా : కేంద్రమంత్రి గడ్కరీ ధ్వజం

భర్త లియోనిడా  సాంప్రదాయ ఉక్రేనియన్ చొక్కా (విషైవాంకా)తో పాటు శిథిలాలనుంచి తీయలేక ఆర్మీ ప్యాంట్, స్నీకర్లతోనే వివాహానికి సిద్ధ మయ్యారు. ల్యుడ్మిలా డ్రెస్‌కు కూడా చిన్న చిన్న రంధ్రాలు పడినప్పటికీ, ఏమాత్రం వెనుకంజ వేయకుండా పెళ్లి చేసుకున్నారు.

"దేవుడు నాకు జీవితాన్ని కొనసాగించే అవకాశం ఇచ్చినప్పుడు, దాన్ని ఎందుకు వాయిదా వేయాలి? ఎవరికో జీవితం ముగిసిపోవచ్చు, కానీ రేపు మాకు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కనీసం ఇప్పటికైనా సంతోషంగా ఉండే హక్కు మాకు ఉంది" అని ల్యుడ్మిలా భావోద్వేగంతో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement