బీజింగ్: తూర్పు చైనాలోని క్వింగ్డావోలోని షిప్‌యార్డులో మరమ్మతులు జరుగుతున్న కార్గో నౌకలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మరో ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. షిప్‌యార్డులో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఉదయం 11:15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
నౌకలో మొత్తం 42 మంది ఉండగా.. వారిలో 12 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మంటలను సిబ్బంది అదుపులోకి వచ్చారు. లైబీరియా జెండాతో ఉన్న ఓషియన్ మెలోడీ(Ocean Melody)నౌకలో ఈ ఘటన జరిగింది. ఈ నౌక ఆగస్టు 31న క్వింగ్డావో షిప్‌యార్డుకు చేరుకుని.. అప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.


