తెలంగాణ: వరంగల్ హన్మకొండ జిల్లాలోని అదాలత్ జంక్షన్‌లో లింగాల కేదారి హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోటల్ యజమాని కేదారి దంపతులు గాయపడినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ఉన్న వారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురయ్యారు.
ఈ అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.
అయితే, మంటల కారణంగా గాయపడిన కేదారి దంపతులను చికిత్స కోసం హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
హోటల్‌లో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..


