సాక్షి, హైదరాబాద్: నగరంలో అంతటా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లలో టీజీ సేఫ్ బృందం తనిఖీలు చేపట్టింది. కూకట్‌పల్లిలో భూలక్ష్మీ మెస్‌లో కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్ పిస్తా హౌస్‌లో..
కాగా, ఉప్పల్ బ్రాంచ్ పిస్తా హౌస్ కేక్ తిన్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. కుళ్లిపోయిన కేక్ అమ్మారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేక్ తిన్న కాసేపటికే వాంతులు అయ్యాయన్న బాధితులు.. కేక్ నుంచి దుర్వాసన వచ్చిందని చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల అత్తాపూర్‌లోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్‌లో హెచ్– ఫాస్ట్, ఫుడ్‌సేప్టీ అధికారుల తనిఖీల్లో ఫ్రిజ్‌లో కుళ్లిన మాంసాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఐస్‌క్రీమ్‌లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. ఏప్రిల్ నెలలో మంగళ్‌హాట్‌లో కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయ గోడౌన్‌పై పోలీసులు దాడులు నిర్వహించగా.. సుమారు వెయ్యి కిలోల మాంసం విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభ కార్యాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి అఫ్రోజ్ నాణ్యత లేని మాంసాన్ని విడిభాగాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి: మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది!


