breaking news
cargo vessel
-
కార్గో నౌకలో చెలరేగిన మంటలు.. 20 మంది..
బీజింగ్: తూర్పు చైనాలోని క్వింగ్డావోలోని షిప్‌యార్డులో మరమ్మతులు జరుగుతున్న కార్గో నౌకలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మరో ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. షిప్‌యార్డులో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఉదయం 11:15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.నౌకలో మొత్తం 42 మంది ఉండగా.. వారిలో 12 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మంటలను సిబ్బంది అదుపులోకి వచ్చారు. లైబీరియా జెండాతో ఉన్న ఓషియన్ మెలోడీ(Ocean Melody)నౌకలో ఈ ఘటన జరిగింది. ఈ నౌక ఆగస్టు 31న క్వింగ్డావో షిప్‌యార్డుకు చేరుకుని.. అప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. -
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం ఫోటోలు
-
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 27 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లోని షితలాఖ్య నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందికి పైగా ప్రయాణీకులతో వెళుతున్న పడవ ఎంఎల్ సబిత్ అల్ హసన్ మరో కార్గో వెజల్‌ను ఢీకొట్టిన ఘటనలో 27 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. పడవతో పాటు కొంత మంది నీటిలో మునిగిపోగా, మరి కొందరు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం 22 మృతదేహాలను వెలికితీయగా, మరో 5 మృతదేహాలను సోమవారం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. ప్రమాదానంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియ పూర్తయిందని బంగ్లాదేశ్ దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ (బిత్వా) ప్రకటించింది. -
కార్గో నౌకతో అమెరికా యుద్ధ నౌక ఢీ
వాషింగ్టన్: అమెరికా నేవికి చెందిన యుద్ధనౌక ఒకటి జపాన్ సముద్ర తీరంలో ఓ కార్గో నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది అమెరికా నేవీ సిబ్బందితోపాటు కార్గో సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వేకువ జామున 2.30 గంటల 3.00గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జపాన్‌లోని యోకోసుఖాకు 56 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికాకు చెందిన ఫిట్జరాల్డ్ అనే ఓ క్షిపణి విధ్వంసక నౌక, పిలిప్పీన్స్ జెండాను కలిగిన ఏసీఎక్స్ క్రిస్టల్ అనే కార్గో నౌక సరిగ్గా 2.30గంటల ప్రాంతంలో అతి సమీపంగా వచ్చాయని ఆ సమాయంలోనే ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్నట్లు అమెరికాకు చెందిన ఏడో నేవీ దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెరికా యుద్ద నౌకలో దాదాపు 330మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల ఓ చోట రంధ్రం ఏర్పడి నీరు లోపలికి వస్తుందని, దాన్ని తాము నియంత్రించగలమని చెప్పారు.


