ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేసిన రష్యా | Russia targets Ukraine rail network as war enters deadly new phase | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేసిన రష్యా

Sep 1 2026 11:34 PM | Updated on Sep 1 2026 11:34 PM

Russia targets Ukraine rail network as war enters deadly new phase

source: X

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. ఆ దేశ రైల్వే నెట్‌వర్క్‌ లక్ష్యంగా భారీ దాడులకు పాల్పడింది. మంగళవారం జరిగిన తాజా దాడిలో లోకోమోటివ్ డిపోపై బాలిస్టిక్ క్షిపణి పడటంతో ఆరుగురు రైల్వే సిబ్బంది మృతి చెందారు.

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ రైల్వే వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్‌పై 1500కు పైగా దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 58 మంది రైల్వే సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 318 మందికి పైగా గాయపడ్డారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, కొన్ని సర్వీసులు 12 నుంచి 15 గంటల వరకు ఆలస్యమవుతున్నాయి.

మరోవైపు కీవ్ ప్రాంతంలో జరిగిన భారీ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

చదవండి: రష్యా చమురుక్షేత్రంపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement