అమ్మ కల...  ఫలించిన వేళ! | sanitation worker Ranu Devi Daughter Aarti Kumari has earned a PhD in Engineering | Sakshi
Sakshi News home page

అమ్మ కల...  ఫలించిన వేళ!

Oct 31 2026 5:05 AM | Updated on Oct 31 2026 5:05 AM

sanitation worker Ranu Devi Daughter Aarti Kumari has earned a PhD in Engineering

సమ్‌థింగ్‌ స్పెషల్‌

రాంచీలోని బిట్‌ మిస్రాలో ఇరవై ఆరు సంవత్సరాల పాటు శానిటేషన్‌ కార్మికురాలిగా పనిచేసింది రానుదేవి. క్యాంపస్‌లో కనిపించే పిల్లల్లో తన పిల్లలను చూసుకొని మురిసిపోయేది. ‘నా పిల్లలు కూడా ఇలాగే మంచి చదువులు చదువుకోవాలి’ అని కలలు కనేది. ‘క్యాంపస్‌లో మెట్లు, గదులు శుభ్రం చేసే నేను తాహతకు మించి కలలు కంటున్నానా?’ అని భయపడేది. భయాల సంగతి ఎలా ఉన్నా ఆమె కల నిజమైంది.

 రానుదేవి కుమార్తె ఆర్తీ కుమారి తల్లి పనిచేసిన బిట్‌ మిస్రాలో ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసింది. భర్త చనిపోయిన తరువాత ముగ్గురు పిల్లలను పెంచే బాధ్యతను భుజాలకెత్తుకుంది రానుదేవి. వారి చదువులకు ఎలాంటి ఆటంకం రాకుండా కష్టపడింది. జార్ఖండ్‌లోని తరుప్‌ గ్రామానికి చెందిన ఆర్తీ కుమారి ఆ గ్రామంలో ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement