హీరోయిన్‌గా మారిన ‘రాను బొంబాయికి రాను’ భామ! | Raanu Nenu Bombai Ki Ranu Song Fame Likhita Tollywood Debut With SAV3 Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న ‘రాను బొంబాయికి రాను’ భామ!

May 31 2026 3:46 PM | Updated on May 31 2026 5:47 PM

Raanu Nenu Bombai Ki Ranu Song Fame Likhita Female Lead In SAV3

‘రాను బొంబాయికి రాను’ ఫోక్‌ సాంగ్‌ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. లిరిక్స్‌ కంటే ఎక్కువగా రామ్‌ రాథోడ్‌, లిఖిత వేసిన స్టెప్పులు బాగా వైరల్‌ అయ్యాయి. అంతేకాదు ఈ ఒక్క పాటతో లిఖిత..తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఈ పాట తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో అలరించిన లిఖిత..ఇక ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఆమెను టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ‘సాV3’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ - డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే  మూవీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలిసింది. నేను ఫోక్ సాంగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నాను. హీరోయిన్ గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఒక బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి కోస్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడకుండా మా విజయ గారు నిర్మించారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది’ అన్నారు.

దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ... లిఖి, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. ‘సాV3’ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.

హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ - బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ  ఈ స్క్రిప్ట్ చెప్పారు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఆయన స్క్రిప్ట్ చెబుతుంటే ఇంకా వినాలని అనిపించింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా స్టోరీ చెప్పారు. ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నాచురల్ గా నటించాం. సామ్రాట్  క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్ గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైమ్ లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం. అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement