వివేకా హత్య కేసులో తేల్చిచెప్పిన సీబీఐ కోర్టు
ఏ వ్యక్తి మరణించినా సమీప బంధువులకు తెలియజేయడం సహజం: సీబీఐ కోర్టు
బాబు చేతిలో పావుగా మారిన సునీత.. కోర్టును సైతం తప్పుదోవ పట్టించే యత్నం
తన తండ్రిని అత్యంత కిరాతకంగా చంపిన దస్తగిరి దర్జాగా తిరుగుతున్నా పట్టించుకోని సునీత
చంద్రబాబు న్యాయవాది లూథ్రాయే హంతకుడు దస్తగిరి తరçఫునా వాదిస్తుంటే అర్థమేమిటి?
బాబు, సునీత, ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకథలేనని సీబీఐ కోర్టు తీర్పుతో స్పష్టం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు చేతిలో పావుగా మారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లేందుకు యత్నించిన ఎల్లో మీడియా, నర్రెడ్డి సునీతలకు సీబీఐ కోర్టు గట్టిగా అక్షింతలు వేసింది. వీళ్లంతా గత కొన్నేళ్లుగా చేస్తున్నదంతా కేవలం దుష్ప్రచారమేనని, అందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని సీబీఐ కోర్టు తీర్పు సాక్షిగా స్పష్టమయ్యింది. నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించాలనుకున్న కుట్రలన్నీ బెడిసి కొట్టాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలన్న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేకన్యాయస్థానం విస్పష్టంగా తీర్పును వెల్లడించింది. రెండువారాలపాటు దాదాపు 20 గంటల సేపు వాదనలు విన్న సీబీఐ కోర్టు 161 పేజీల సుదీర్ఘమైన, స్పష్టమైన తీర్పును వెలువరించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతిపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఏ వ్యక్తి మరణించినా, అతని సమీప బంధువులకు తెలియజేయడం చాలా సహజమని.. వివేకా హత్య విషయం జగన్‌కు తెలియజేయడాన్ని తప్పుబట్టడంగానీ, అనుమానించడంగానీ సరికాదని కోర్టు స్పష్టం చేసింది. వివేకా హత్యకు సంబంధించి వైఎస్ జగన్‌కు ముందే కాల్ వచ్చిందంటూ చంద్రబాబు, ఆయన చేతిలో పావుగా మారిన సునీత, ఎల్లోమీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని, అంతా కట్టుకథేనని ఈ తీర్పును బట్టి స్పష్టమయ్యింది.
స్వయంగా కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా హత్యచేసిన దస్తగిరి బైట దర్జాగా తిరుగుతుంటే ప్రశ్నించాల్సిన సునీత.. చంద్రబాబు కేసులు వాదించే సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా దస్తగిరి న్యాయవాదిగా మారి వాదిస్తుంటే పట్టించుకోని సునీత.. చేస్తున్న ఆరోపణలన్నీ దిగజారుడు ఆరోపణలేనని సీబీఐ కోర్టు తీర్పుతో వెల్లడైంది.చంద్రబాబు చేతిలో పావుగా మారి సీబీఐ కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు సునీత ప్రయతి్నంచినట్లు ఈ తీర్పును బట్టి అర్ధమవుతోంది.
‘వైఎస్ జగన్ స్వయానా వివేకా సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు. జగన్ తాతగారైన రాజారెడ్డికి, వైఎస్ భాస్కర్‌రెడ్డి తండ్రి చిన్న కొండారెడ్డి కుటుంబాలకు ఏదో చిన్న ఆస్తి తగాదాలు తప్ప.. జగన్, వివేకాకు మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నది ప్రాసిక్యూషన్ వాదన’ అని పేర్కొంది. నాటి సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డిలను విచారించినా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ సునీత విజ్ఞప్తిని తిరస్కరించింది. చార్జిïÙట్ ప్రకారం వారికి హత్యతో ఏదైనా సంబంధం ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదంది.
హత్య జరిగిన రోజు(2019 మార్చి 15) ఉదయం 5:30 గంటలకు జగన్‌మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిందంటూ చేస్తోన్న ఆరోపణలపై మరింత దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయపడింది. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో నర్రెడ్డి సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈ నెల 10న తీర్పును వెల్లడించిన న్యాయస్థానం.. మంగళవారం అధికారిక కాపీని విడుదల చేసింది. వివరాలు ఆ మేరకు..
చాలా అంశాలపై దర్యాప్తునకు నిరాకరణ
‘ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి జె.శంకర్‌ను సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద విచారించారు. 2021, సెపె్టంబర్ 28న వాంగ్మూలంలో జరిగిందంతా చెప్పారు. ఈ విషయంలో తదుపరి విచారణ అవసరం లేదు. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని రక్షించడానికి, హత్యకు బాధ్యత వహించేందుకు శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లను గంగాధర్‌రెడ్డికి ఇవ్వాలని చూశారని, అతని పాత్రపై విచారణ చేసినందున దర్యాప్తు చేయాలన్న సునీత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేం.
అవినాశ్‌రెడ్డితో సునీల్‌యాదవ్‌కు ఉన్న సంబంధం.. హత్యకు ముందు, తర్వాత వారి కదలికలకు సంబంధించి మొబైల్ ఫోన్ల కాల్ డేటా రికార్డు సేకరించి ఇప్పటికే పరిశీలించారు. హత్య జరిగిన రోజు అవినాశ్‌రెడ్డి ఎక్కడ ఉన్నారనే విషయానికి సంబంధించి ఐపీడీఆర్ విశ్లేషణ జరిగింది. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం... న్యాయవాది ఓబుల్‌రెడ్డి, భరత్‌యాదవ్‌లు అవినాశ్‌రెడ్డికి సన్నిహితులు.
ఎంవీ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఓబుల్‌రెడ్డి కూడా స్టేషన్‌కు వెళ్లారు. భరత్ యాదవ్ వాంగ్మూలాన్ని సెక్షన్ 161 కింద 2021, జూన్ 28న నమోదు చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు స్టేషన్‌కు వెళ్లారన్న ఒక్క కారణంతో ఓబుల్ రెడ్డి పాత్రపై తదుపరి దర్యాప్తుకు ఆదేశించలేం. ఆర్థిక లావాదేవీలు ఉంటే విచారణ సమయంలో నిరూపించవచ్చు’అని పేర్కొంది.
అనుమానం ఆధారం కాదు..
‘సయ్యద్ మున్నాకు చెందిన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లోని లాకర్ తెరవడం, అందులో నగదు, ఆభరణాలు లభించడం విషయానికొస్తే.. మరో తాళంతో సీబీఐ తిరిగి వాటిని లాకర్‌లో ఉంచినందున దీనిపై తదుపరి విచారణ అవసరం లేదు. మున్నా లాకర్‌లో లభించిన మొత్తానికి సంబంధించి సీబీఐ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు తెలియజేసింది. 2019, మార్చి 14 నాటి ఫుటేజీకి కాకుండా కేవలం 15 నాటి ఫుటేజీకి మాత్రమే సీబీఐ పరిమితమైందన్న పిటిషనర్ చేసిన వాదననూ అనుమతించలేం.
ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తారు. పిటిషనర్ వద్ద తన వాదనకు ఎటువంటి ఆధారం లేదు. హత్య జరిగిన రోజు ఒకే విధమైన నడక ఉన్న వ్యక్తిని గమనించిన విషయానికి సంబంధించి పిటిషనర్ అభ్యంతరం సరికాదు. కేవలం అనుమానం ఆధారంగా, ప్రత్యేకించి చిత్రం స్పష్టంగా లేనప్పుడు, ఆ విషయంలో తదుపరి విచారణ జరిపినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఇదే విషయాన్ని వి.శివకుమార్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. నేర స్థలం ఫోటోలు, వీడియోల ఫోరెన్సిక్ నివేదిక అసంపూర్ణంగా ఉందన్నది ఈ దశలో నిర్ణయించలేం. విచారణ సమయంలో సంబంధిత సాక్షులను విచారించడం ద్వారా దానిని పరీక్షించవచ్చు’అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
డ్రైవర్ లోవరాజు ఏప్రిల్ ఉద్యోగం మానేయడం, హత్య జరిగిన రోజు విధులకు గైర్హాజర్ కావడానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. దర్యాప్తు అధికారి రాజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ, అవినాశ్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రాఘవ రెడ్డిని సరిగ్గా విచారించలేదనే పిటిషనర్ వాదనను స్వాగతించలేం.
ఎందుకంటే, నిందితులతో రాఘవ రెడ్డి ఎలాంటి లావాదేవీలు జరిపారని గానీ లేదా మధ్యవర్తిగా వ్యవహరించారని గానీ చార్జిషీట్‌లో ఎక్కడా పేర్కొనలేదు. ఇప్పటికే విచారించిన సాక్షులను తిరిగి విచారించడం అంటే.. దర్యాప్తు మళ్లీ మొదటి నుంచి ప్రారంభినట్లు అవుతుంది. ఇది అనుమతించబడదు. శివశంకర్‌రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిపైనా దర్యాప్తు అనవసరం’ అని న్యాయస్థానం పేర్కొంది.


