రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా? | KSR Comment On Will Central Govt Demolition After Supreme Verdict | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?

Nov 29 2025 10:30 AM | Updated on Nov 29 2025 11:02 AM

KSR Comment On Will Central Govt Demolition After Supreme Verdict

చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల  తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా  మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. 

ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం  గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక  పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న  విమర్శలు కూడా లేకపోలేదు.

అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర  ప్రభుత్వాన్ని  నడుపుతున్న రాజకీయ పార్టీ  విపక్ష రాష్ట్ర  ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న  విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మద్యకాలంలో కేరళ  ల చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. 

దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల  తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా  మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం  గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. 

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక  పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న  విమర్శలు కూడా లేకపోలేదు.అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర  ప్రభుత్వాన్ని  నడుపుతున్న రాజకీయ పార్టీ  విపక్ష రాష్ట్ర  ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న  విమర్శ ఎప్పటి నుంచో ఉంది. 

ఈ మద్యకాలంలో కేరళ  లో కొంతకాలం క్రితం వరకు ఉన్న గవర్నర్ కు, సిపిఎం ప్రభుత్వానికి మద్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, కర్నాటక ,పంజాబ్, పశ్చిమబెంంగాల్  రాష్ట్రాలలోని బిజెపియేతర  ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్నాయి. రాష్ట్రాలలో ఇది రాజకీయ దుమారంగా ఉంటోంది. తమిళనాడులో శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ తొక్కి పెట్టి ఉంచారు. దానిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లినప్పుడు ఇద్దరు  న్యాయమూర్తుల ధర్మాసనం మూడు నెలల  గడువులోపు బిల్లులపై నిర్ణయం చేయాలని తీర్పు ఇచ్చింది. అది సంచలనంగా మారింది. కాని కేంద్రం దీనిని అంగీకరించలేదు. 

రాష్ట్రపతి ఈ విషయంలో పద్నాలుగు  ప్రశ్నలు సంధిస్తూ సుప్రింకోర్టుకు లేఖ రాశారు.ఆ మీదట రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ జరిపి రాష్ట్రపతి,గవర్నర్ లకు గడువు విధించలేమని స్పష్టం చేసింది. అలాఅని సుదీర్ఘ సమయం తీసుకోవడం కూడా సరికాదని,ఫెడరల్ స్పూర్తికి విరుద్దం  అన్నప్పటికీ,  అలా వ్యవహరిస్తే పరిష్కారాన్ని  సుప్రింకోర్టు సూచించినట్లు అనిపించదు.ఇది దేశంలో భవిష్యత్తులో మరిన్ని  రాజకీయ ,రాజ్యాంగ సంక్షోభాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. 

కేంద్రం కనుక  దీనిని తనకు అనుకూలంగా మలచుకుని రాష్ట్రాలపై గవర్నర్ ల ద్వారా మరింత పెత్తనం చేయవచ్చు.ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.ఒకవేళ రాష్ట్రాలు ఏదైనా రాజ్యాంగ విరుద్దమైన  చట్టాన్ని రూపిందిస్తే దానిపై   నిపుణులైన న్యాయ కోవిదులతో పాటు ,వివిధ వర్గాల అభిప్రాయం తీసుకుని గవర్నర్ లు   నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాటు చేయడం అవసరం అనిపిస్తుంది..  

బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం,లేదా పునస్సమీక్షకు అసెంబ్లీకి తిరిగి పంపడం అనే ఆప్షన్లు ఉన్నాయని అంటూనే గడువు పెట్టలేమని చెప్పడం వల్ల రాజకీయ సమస్య అయ్యే అవకాశం ఉంటుందనిపిస్తుంది. ఈ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యను చూస్తే ఆపివేలయాలన్న బిల్లులను అసెంబ్లీకి తిరిగి పంపడం అనేది ఆప్షన్ కాదని, నిబంధన అనడం బాగానే ఉంది. ఇక్కడే ఒక సందేహం వస్తుంది. న్యాయమూర్తుల మనసులలో గవర్నర్ ల అధికారాలపై అనుమానాలు ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో ఉన్న  అంశాలను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఆ నిబంధనను  గవర్నర్ లు పట్టించుకోకపోతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మరింత స్పష్టత అవసరం అనిపిస్తుంది. 

రాజ్యాంగ విరుద్దం కానప్పటికీ, గవర్నర్ లు కావాలని బిల్లులను ఆమోదించకుండా ఉంటే ఏమి చేయాలన్నది ఇప్పుడు ప్రశ్న.ప్రజాస్వామ్యంలో  గవర్నర్ లు పెత్తనంపై ఇంతవరకు చాలా చర్చ జరిగింది. సర్కారియా కమిషన్ వంటివి దీనిపై విస్తృతంగా పరిశీలన చేసి అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా చట్టసభలలో మెజార్టీ పై గవర్నర్ ఏకపక్షంగా  నిర్ణయం తీసుకోవడం కాకుండా శాసనసభలలోనే రుజువు చేసుకోవాలన్న సూత్రం అప్పటి నుంచే వచ్చింది. 1980,90 వ దశకాలలో ఉమ్మడి ఎపితో పాటు పలు రాష్ట్రాలలో గవర్నర్ ల తప్పుడు నిర్ణయాల వల్ల రాజకీయ సంక్షోభాలు వచ్చాయి. మెజార్టీ లేని పార్టీ నేతలకు కేంద్రం లోని పెద్దల సలహాల మేరకు పట్టం కట్టి నాలుక కరచుకున్న ఘట్టాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు గవర్నర్ ల వ్యవస్థ ఉండరాదని వాదించేవారు. 

ఆయన  సీఎం.గా ఉన్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన  గవర్నర్ కుముద్ బెన్ జోషి తో తరచు  వివాదాలు ఏర్పడేవి.  ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాలలో గవర్నర్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కాకపోతే ఆయన ఎప్పుడూ ఒక స్థిరమైన విధాన నిర్ణయానికి కట్టుబడి లేరు. యుపిలో గవర్నర్ కు వ్యతిరేకంగా బిజెపి అగ్రనేత వాజ్ పేయి ఏకంగా నిరాహార దీక్షకు దిగిన సందర్భం కూడా ఉంది. పశ్చిమబెంగాల్ లో  గతంలో గవర్నర్ గా ఉన్న జగదీప్ ధంఖడ్ కు, ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఎంత పెద్ద రగడ నడిచింది ఇటీవలి చరిత్రే. చివరికి ధంఖడ్ ఒక సందర్భంలో అసెంబ్లీ వద్దకు వెళితే గేటు కూడా తెరలేదు. 

ప్రస్తుత గవర్నర్ తో కూడా వివాదం సాగుతోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే టీఎంసీ  పార్లమెంటు సభ్యుడు ఒకరు రాజ్ భవన్ లో ఆయుధాలు  ఉన్నాయని ఆరోపించారు.  దానిపై ఆయన మీద కేసు పెట్టడం, అందుకు ప్రతిగా గవర్నర్ ఆఫీస్ పై  ఎమ్.పి కేసు పెట్టడం జరిగింది.  ఇప్పుడు బిల్లుల ఆమోదం తో పాటు పలు అంశాలపై బిజెపి ప్రభుత్వ నియమిత  గవర్నర్ లు వ్యవహరిస్తున్న  తీరుపై ఎన్.డి.ఎ.  యేతర ప్రభుత్వాలు గుస్సగాఉన్నాయి. ఉదాహరణకు ఎమ్మెల్సీ నియామకాలపై గవర్నర్ లు ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు.ఎన్.డి.ఎ.పాలిత రాష్ట్రాలలో గవర్నర్ లు  రాష్ట్రాల అభిమతం మేరకు  నడుచుకుంటారు. 

గతంలో కాంగ్రెస్ కేంద్రంలో పవర్ లో ఉన్నప్పుడు కూడా ఇదే తంతు సాగేది.  ఈ నేపధ్యంలో మంత్రివర్గ సలహాను  కూడా గవర్నర్ లు విధిగా పాటించనవసరం లేదని సుప్రింకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల  ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సరికొత్త సంక్షోభాలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావడం మంచిది. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని కొందరు న్యాయకోవిదులు  అభిప్రాయపడుతున్నారు.  ప్రజలు ఎన్నుకున్న  ప్రభుత్వాలకు అధికారం కాకుండా, నామినేటెడ్ గవర్నర్ లకు అధికారం ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదని చెప్పాలి.










-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
 
Advertisement
Advertisement