10న సహ చట్టం ప్రధాన కమిషనర్‌ ఎంపిక | December 10 to select the Chief Information Commissioner amid ongoing vacancies in the CIC | Sakshi
Sakshi News home page

10న సహ చట్టం ప్రధాన కమిషనర్‌ ఎంపిక

Dec 2 2025 5:42 AM | Updated on Dec 2 2025 5:42 AM

December 10 to select the Chief Information Commissioner amid ongoing vacancies in the CIC

సుప్రీంకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌ ఎంపిక, నియా మకంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టత నిచ్చింది. ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశ మయ్యే కమిటీ ప్రధాన కమిషనర్‌తోపాటు కమిషనర్ల పోస్టులకు పేర్లను పరిశీలించనున్నట్లు తెలిపింది. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చిల ధర్మాసనానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ ఈ విషయం తెలిపారు. ప్రధాని సారథ్యంలోని ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత, ఒక కేంద్ర మంత్రి ఉంటారు. ఈ కమిటీ ప్రధాన సహ కమిషనర్‌ను, ఇతర కమిషనర్ల పేర్లను సిఫారసు చేస్తుంది. రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్లలో ఖాళీల వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఎస్‌ఐఆసీలను ఆదేశించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement