తాలిబాన్ల చేతిలో.. పాక్‌కు ఘోర అవమానం | A Humiliating Blow To Pakistan At The Hands Of The Taliban Viral, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

తాలిబాన్ల చేతిలో.. పాక్‌కు ఘోర అవమానం

Oct 16 2025 8:11 AM | Updated on Oct 16 2025 11:03 AM

A humiliating blow to Pakistan at the hands of the Taliban Viral

పరస్పర ఆరోపణలతో.. అఫ్తనిస్తాన్‌-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గాన్ పౌరులు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాలిబాన్‌ సైన్యం ప్రతిచర్యలకు దిగడంతో పాక్‌ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం తప్పదనే భావిస్తున్న తరుణంలో.. అనూహ్యంగా 48 గంటలపాటు కాల్పుల విరమణ తెరపైకి రావడం గమనార్హం. ఈ క్రమంలో..  

కాబూల్, కాంహార్ దాడులపై అఫ్గనిస్తాన్‌ ప్రజలు రగిలిపోతున్నారు. స్పిన్‌ బోల్దక్‌ వద్ద పాక్‌ మిలిటరీ ఔట్‌ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేయగా, సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు సమాచారం. భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్‌ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్‌ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

పాక్‌ దాడుల నేపథ్యంలో అఫ్గన్‌ ప్రజలు తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే మేము కూడా ముజాహిదీన్‌గా మారిపోయి యుద్ధానికి సిద్ధం అని కాందహార్‌ యువకులు కొందరు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబాన్‌ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుంది. ప్రజలంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తాలిబాన్‌తో ఉన్నారు అని పక్తియా ప్రజలు అంటున్నారు. మా భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటాం అని కాబూల్‌ వాసి ఒకరు తెలిపారు.

బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. పాక్‌ సైన్యం విడిచిపెట్టిన అవుట్‌పోస్టుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంట్‌లను తాలిబాన్ ప్రదర్శిస్తోంది అని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇది పాక్‌కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది. 

 

 పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ ఒకప్పుడు మిత్రదేశాలే అయినా.. డ్యూరాండ్‌ లైన్‌ విషయంలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు 7 చోట్ల ఘర్షణలకు దిగాయి. తొలుత కాబూల్‌లోని తెహ్రాక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) క్యాంపులపై పాక్‌ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా 200 మంది తాలిబన్లు, 58 మంది పాక్‌ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 

2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్‌తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం.  మరోవైపు.. అఫ్గనిస్తాన్‌ మంత్రి భారత పర్యటనకు వెళ్లిన వేళే.. ఈ దాడులు మొదలయ్యాయి.  కాబూల్‌లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్‌కు కంటగింపుగా మారింది. భారత్, అఫ్గానిస్తాన్‌ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్‌ జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.

ప్లీజ్‌.. మధ్యవర్తిత్వం వహించరా?
కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటన చేసుకుంటున్నారు. తాలిబాన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాక్‌, పాకిస్తాన్‌ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్‌ చెబుతున్నారు. మరోవైపు.. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను పాక్‌ తరఫున ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబాన్లను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని కోరింది.

ఇదీ చదవండి: ఇక నేనే ప్రెసిడెంట్‌ని.. నేను చెప్పినట్లే ప్రజలు వినాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement