
ఆసియాకప్-2025లో అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ ఆరంభంలోనే రెహ్మతుల్లా గుర్బాజ్(8), ఇబ్రహీం జాద్రాన్(1) వికెట్లు కోల్పోయినప్పటికి.. ఓపెనర్ సెదికుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్ దుమ్ములేపారు.
వీరిద్దరూ హాంకాంగ్ బౌలర్లను వీరిద్దరూ ఉతికారేశారు. అటల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలవగా.. ఒమర్జాయ్ కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరితో పాటు మహ్మద్ నబీ(33) రాణించాడు.
హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, అయూష్ శోక్లా తలా రెండు వికెట్లు పడగొట్టగా..ఇషాన్, అతీక్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే హాంకాంగ్ ఫీల్డర్లు మూడు సునాయస క్యాచ్‌లను జారవిడిచారు. ఫలితంగా అఫ్గాన్ ఈ భారీ స్కోర్ సాధించగల్గింది.