దక్షిణాసియాలో మరో దేశంలో రాజకీయ అస్థితరత తప్పేలా కనిపించడం లేదు. అఫ్గాన్ తాలిబన్ల ప్రభుత్వం త్వరలోనే కూలిపోయే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పేర్కొంది. ఇటీవల ఆదేశ సుప్రీం లీడర్ ఆడియో టేప్‌లో ఇదే విషయాలు బహిర్గతమయినట్లు తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. చాలా దేశాలు రాజకీయ అస్థితరతతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, సిరియా లాంటి దేశాలు అంతర్గత సంక్షోభంతో అట్టుడికిపోతున్నాయి. అయితే తాజాగా ఆ కోవలో అఫ్గానిస్థాన్ చేరునుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాలిబన్ల అగ్రనాయకత్వంలో తీవ్ర లుకలుకలున్నాయని వారి మధ్య విభేదాలు ఇటీవల ఆ దేశ తాలిబన్ లీడర్ అయతుల్లా అఖుండ్జాదా మాటల్లో తేటతెల్లమయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది.
ఇటీవల అఫ్గాన్ లీడర్ అఖుండ్జాదా ప్రసంగాన్ని బీబీసీ విడుదల చేసింది. అందులో ఆయన మాట్లాడుతూ "ప్రభుత్వంలో విభేదాలున్నాయి. అంతర్గత విభేదాలు ఇలానే పెరుగుతుంటూ పోతే తాలిబన్ ప్రభుత్వం కూలిపోతుంది". అని ఆయన హెచ్చరించినట్లు బీబీసీ ప్రచురించింది. అంతేకాకుండా తాలిబన్లలో ప్రస్తుతం రెండు వర్గాలున్నాయని వెల్లడించింది.
మెుదటివర్గం అఫ్గాన్ సుప్రీం లీడర్ అఖుండ్జాదాకు విదేయులుగా ఉంటూ ఆదేశాన్ని ఇస్లామిక్ పాలనకు కేంద్ర స్థానంగా చేయాలని యత్నిస్తున్నారని తెలిపింది. వీరు కాందహార్ నుంచి పనిచేస్తున్నట్లు పేర్కొంది. మరోకవర్గమేమో సిరాజ్ హుక్కానీ నేతృత్వంలో పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తూ మహిళలకు పిల్లలకు కనీస హక్కులు కల్పించాలని భావిస్తున్నట్లు బీబీసీ తెలిపింది. వీరి కేంద్రం కాబూల్ అని పేర్కొంది.
అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన 2021లో ప్రారంభమైంది. ఆసమయంలో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో అప్పటి ఆదేశ అధ్యక్షుడు అష్రప్ ఘనీ దేశం విడిచిపారిపోయారు. దీంతో వారి పాలన అధికారికంగా ప్రారంభమైంది.


