
కాబుల్: అప్ఘానిస్థాన్‌పై ప్రకృతి పగబట్టింది. వరుస భూకంపలతో మారణహోమం సృష్టిస్తోంది. తాజాగా శుక్రవారం రోజు గంటల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. శుక్రవారం అర్ధరాత్రి 3.16గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.9తీవ్రత .. ఉదయం 7గంటల 6 సెకన్ల సమయంలో 5.2 తీవ్రత, మళ్లీ ఉదయం 7గంటల 46సెకన్ల సమయంలో 4.6తీవ్రతతో భూకంపం సంభవించింది.
భూకంప కార్యకలాపాల పర్యవేక్షించే భారత్ ప్రభుత్వ సంస్థ ఆధారంగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) శుక్రవారం అర్ధరాత్రి 3.16గంటలకు ఆప్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని జలాలాబాద్ అనే నగరంలో రిక్టర్ స్కేలుపై 4.9తీవ్రతతో భూమి మీద నుంచి 120కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
ఉదయం 7గంటల 6 సెకన్ల సమయంలో 5.2 తీవ్రతతో కునార్‌లో 140కిలోమీటర్ల లోతులో .. ఉదయం 7గంటల 46సెకన్ల సమయంలో 4.6 తీవ్రతతో గాజియాబాద్‌లో భూమికంపించింది. అయితే,భూమి మీద నుంచి వందల కిలోమీటర్ల లోపల భూమికంపించడం వల్ల ప్రాణం నష్టం కంటే ఆస్తినష్టం ఎక్కువగా జరుగుతుంది.
సెప్టెంబర్ 1 నుంచి వరుస భూకంపాలు
సెప్టెంబర్ 1 నుంచి వరుస భూకంపాలు ఆప్ఘానిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సెప్టెంబర్ 1న రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 5,400 కంటే ఎక్కువ ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి
2,205 మరణాలు
ఈ విపత్తు తాలిబన్ పరిపాలనలో మూడో అతిపెద్ద భూకంపంగా నమోదైంది. సహాయక చర్యలకు పర్వత ప్రాంతాలు, దూర ప్రాంతాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. దీంతో తమను రక్షించాలని తాలిబాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి సహాయం కోరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగువరకు సంభవించిన భూకంపం కారణంగా 2,205 మరణించినట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి హిమ్మదుల్లా అధికారికంగా ప్రకటించారు.