మళ్లీ మా దేశంలో దాడి జరిగితే వారిని తిరిగి గుహలకు పంపుతాం
శాంతి చర్చలు విఫలమైన వేళ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ బెదిరింపు
ఇస్లామాబాద్: ఆఫ్గనిస్తాన్ నుంచి తమ దేశంలో మళ్లీ ఉగ్రవాద దాడులు జరిగితే ఆ దేశంలో అధి కారంలో ఉన్న తాలిబన్లను తుడిచిపెట్టేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చ రించారు. సోదర దేశంగా శాంతి నెలకొల్పేందు కు ఆఫ్గనిస్తాన్‌కు ఒక అవకాశం ఇచ్చామని, కా నీ.. ఆ దేశంలోని కొందరు నేతలు చేస్తున్న ప్రక టనలు తాలిబన్ల సంకుచిత బుద్ధిని బయటపెడు తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు బుధ వారం ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘పాకిస్తాన్‌కు ఉన్న ఆయుధాల్లో చిన్న భాగాన్ని వాడినా తాలిబన్ల పాలనను అంతం చేసి, వారిని తిరిగి గుహల్లోకి తరమగలం.
వాళ్లు అదే గనుక కోరుకుంటే.. గతంలో మాదిరిగానే తోకలు ము డుచుకుని తోరాబోరా గుహల్లోకి మళ్లీ పరుగులు తీయటం అక్కడి ప్రజలు చూస్తారు. తాలిబన్లు పోరాటాన్నే కోరుకుంటే.. వారి సర్కస్ ఫీట్లను ప్రపంచం మొత్తం చూస్తుంది. మీ ద్రోహాన్ని, అపహాస్యాన్ని చాలాకాలంగా భరిస్తున్నాం. ఇక భరించేది లేదు. పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగినా, ఆత్మాహుతి దాడి జరిగినా.. ఆ దుస్సాహసానికి తగిన ప్రతిఫలాన్ని రుచి చూస్తారు. మా శక్తిసా మర్థ్యాలను పరీక్షించాలని చూస్తే.. అదే మీ అంతం అవుతుంది. ఆఫ్గనిస్తాన్‌ను సామ్రాజ్యాల స్మ శానం అంటుంటారు కదా! పాకిస్తాన్ సామ్రాజ్యం కాదు. కానీ, ఆఫ్గనిస్తాన్ మాత్రం కచ్చితంగా వారి సొంత ప్రజల స్మశానమే. నిజానికి మీ దేశం సామ్రాజ్యాల స్మశానం కాదు. మీ చరిత్ర మొత్తం సామ్రాజ్యాల ఆట స్థలం’అని ఎద్దేవా చేశారు.
చర్చలు విఫలం
పాకిస్తాన్– ఆఫ్గనిస్తాన్ మధ్య కొద్దిరోజులుగా టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటాన్ని ఆపేయాలన్న పాకిస్తాన్ ప్రధాన డిమాండ్‌కు ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు అంగీకరించకపోవటంతో చర్చల్లో ప్రతిష్టంభణ ఏర్పడింది. టర్కీ మధ్యవర్తిత్వంతో గత శనివారం నుంచి జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయని పాకిస్తాన్ సమాచా ర శాఖ మంత్రి అత్తొల్లా తరార్ బుధవారం ప్రకటించారు.
ఉగ్రవాదులను నిర్మూలించటంలో ఆఫ్గనిస్తాన్ నుంచి దీర్ఘకాలిక సహకారాన్ని ఆశించామని, సీమాంతర ఉగ్రవాద నిర్మూలన కోసం ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైనప్పటి నుంచి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. దోహాలో తాలిబన్లు రాత పూర్వకంగా ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరినా అటువైపు నుంచి సానుకూల స్పందన రాలేదని ఆరోపించారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, శాంతి స్థాపన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు. చర్చల విఫలంపై తాలిబన్ల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు తమ ప్రజల భద్రత, శాంతి కోసం వీలైనన్ని మార్గాల్లో చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటామని పాకిస్తాన్ సైనిక వర్గాలు తెలిపాయి.


