పాక్‌లో ఇంకా 20 లక్షల మంది అఫ్గాన్లు | UNO Says 20 lac Afghanistanis Live In Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఇంకా 20 లక్షల మంది అఫ్గాన్లు

Dec 27 2025 7:42 AM | Updated on Dec 27 2025 7:42 AM

UNO Says 20 lac Afghanistanis Live In Pakistan

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఇప్పటికీ 20 లక్షల మందికి పైగా అఫ్గాన్లు నివసిస్తున్నారని ఐరాస శరణార్ధి విభాగం తెలిపింది. 2025లో 10 లక్షల మంది వరకు ఆ దేశం నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారంది. ఒక్క నవంబర్‌లోనే 1.71 లక్షల మంది అఫ్గానిస్తాన్‌కు వచ్చారని తెలిపింది.

పాక్‌ అధికారులు చమన్, తోర్ఖామ్, బారాబ్చా బోర్డర్‌ పాయింట్ల మీదుగా మరో 37, 899 మందిని వెనక్కి పంపించి వేశారని పేర్కొంది. నవంబర్‌లో రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మానవతా సాయం పంపిణీపై ప్రభావం చూపాయని తెలిపింది. తమ దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటున్న అఫ్గాన్లను పంపించి వేసేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం 2023 సెపె్టంబర్‌ నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. స్వదేశంలో అస్థిర పరిస్థితులు, అణచివేత చర్యల కారణంగా వీరంతా పొరుగుదేశంలో తలదాచుకుంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement