పాక్‌, ఆప్ఘన్‌ బోర్డర్‌లో టెన్షన్.. పా​కిస్తాన్‌కు బిగ్‌ షాక్‌ | Afghan seize border posts along Durand Line | Sakshi
Sakshi News home page

పాక్‌, ఆప్ఘన్‌ బోర్డర్‌లో టెన్షన్.. పా​కిస్తాన్‌కు బిగ్‌ షాక్‌

Oct 12 2025 7:47 AM | Updated on Oct 12 2025 9:34 AM

Afghan seize border posts along Durand Line

కాబూల్‌: పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్‌, పాక్‌ మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు సైనికులు 12 మంది చనిపోయినట్టు ఆప్ఘన్‌ ప్రకటించింది. మరోవైపు.. ఆప్ఘన్‌ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది.

పాక్‌, ఆప్ఘన్‌ సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శనివారం అర్థరాత్రి సరిహద్దులో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కాల్పుల్లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ప్రకటించింది. బహ్రంచా జిల్లాలోని షకీజ్, బీబీ జాని, సలేహాన్ ప్రాంతాలలో, అలాగే పక్తియాలోని ఆర్యుబ్ జాజీ జిల్లా అంతటా తీవ్ర పోరాటం జరిగినట్లు నివేదించింది.

అయితే, పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా దాడులు జరిపినట్టు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవరాజ్మి ఈ ఆపరేషన్‌ను అభివర్ణించారు. శనివారం అర్ధరాత్రి నాటికి ఘర్షణలు ముగిశాయని ఆయన అన్నారు. మరోసారి పాక్‌.. ఇలా గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాకిస్తాన్‌ గగనతలాన్ని తాము ఆక్రమిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక, పాకిస్తాన్ భద్రతా అధికారులు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ దాడులను తమ దళాలు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా వారి విభేదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement