
ఆసియాకప్-2025 కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం 22 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు.
మహ్మద్ నబీ, కరీం జనత్, గుల్బీద్దన్ నైబ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదేవిధంగా అబ్దుల్లా అహ్మద్‌జాయ్, బషీర్ అహ్మద్, వఫియుల్లా తారఖిల్ వంటి యువ సంచలనాలకు అఫ్గాన్ సెలక్టర్లు అవకాశమిచ్చారు.
కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు అఫ్గానిస్తాన్ జట్టు షార్జా వేదికగా యూఏఈ, పాకిస్తాన్‌లతో ట్రై సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందు యూఏఈకు అఫ్గాన్ జట్టు వెళ్లనుంది. అక్కడ రెండు వారాల పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో అఫ్గాన్ జట్టు పాల్గోనుంది.
ఆ తర్వాత ఆసియాకప్‌నకు కోసం 15 మంది సభ్యుల ప్రధాన జట్టును ఏసీబీ ఖరారు చేయనుంది. కాగా అఫ్గాన్-యూఏఈ- పాక్ ట్రైసిరీస్ ఆగస్టు 29న ప్రారంభమై.. సెప్టెంబర్ 7న ముగియనుంది. అనంతరం సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో అఫ్గాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది.
అఫ్గానిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, వఫివుల్లా తారఖిల్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, మొహమ్మద్ ఇషాక్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ నబీ, నంగ్యాల్ ఖరోటీ, షరాఫుద్దీన్ అష్రఫ్, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, ముజీబ్ జద్రాన్, అమీర్ హంజా గజన్ఫర్, నూర్ అహ్మద్,ఫజల్ హక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్, ఫరీద్ మాలిక్, సలీమ్ సఫీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, బషీర్ అహ్మద్.