
వాషింగ్టన్: పాకిస్తాన్–ఆఫ్గనిస్తాన్ మధ్య పెరుగు తున్న ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య ఘ ర్షణను ఆపటం తనకు చిటికెలో పని అని తెలి పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పాకిస్తాన్‌పై జరుగుతున్న దాడి, ఆఫ్గని స్తాన్‌పై పాక్ జరుపుతున్న దాడి గురించి నాకు అర్థమవుతోంది.
నేను గనుక పరిష్కరించాలని అనుకుంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపటం చాలా తేలిక. ప్రజలను చంపే ఘర్షణలను ఆపటం అంటే నాకు చాలా ఇష్టం. నేను లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను. ఈ యుద్ధాన్ని ఆపటంలో కూడా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పాక్–ఆఫ్గాన్ మధ్య సైనిక ఘర్ష ణ జరుగుతున్న విషయం తెలిసిందే.