అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. రషీద్ ఇటీవల ‘ఖాన్ ఛారిటీ ఫౌండేషన్’ ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి రషీద్ ఖాన్ ఓ అమ్మాయితో హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
దీంతో ఎవరూ ఈ అమ్మాయి అన్న చర్చ నెట్టింట మొదలైంది. రషీద్ ఖాన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ తన రెండో పెళ్లి నిజమేనంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊహాగానాలకు తెరదించాడు.
"2025 ఆగస్టు 2న నా జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. నన్ను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమె నా జీవిత భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకువెళ్లాను.
కానీ దురదృష్టవశాత్తు దీని గురించి ప్రజలు రకరకాల ఊహాగానాలను ప్రచారం చేశారు. ఆమె నా భార్య, ఇందులో దాచుకోవడానికి ఏమి లేదు. నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు" అని తన ఇన్‌స్టా ఖాతాలో రషీద్ పేర్కొన్నాడు.
కాగా రషీద్ గతేడాది అక్టోబర్‌లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ మొదటి పెళ్లి జరిగింది. రషీద్ వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయినట్లు సమాచారం.
చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?


