అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో బాంబుపేలుళ్లు కలకలం రేపుతున్నాయి. షహర్-ఏ-నవ్ ప్రాంతంలో తీవ్రబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు పౌరులు మృతిచెందగా, 13 మంది గాయపడ్డట్లు తాలిబన్ దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే పేలుళ్లు ఏలా జరిగాయి. ఏవరు చేశారనే సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ దాడులు చైనీస్ ఫుడ్‌కోర్టులు అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగాయి. దీంతో చైనీయులే టార్గెట్‌గా ఈ దాడులు జరిగినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న దర్యాప్తు సంస్థలు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించాయి. కాగా షహర్-ఎ-నవ్ ప్రాంతం అక్కడ ఉండే సురక్షిత ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు అక్కడే పేలుళ్లు జరగడం చర్చనీయాంశమయ్యింది.
🔴BREAKING: Several people were killed and many others injured in a blast in Kabul’s Shahr-e-Naw area, Afghanistan’s Taliban interior ministry said. Afghan Times reports said the explosion occurred in front of a Chinese restaurant. pic.twitter.com/waiVEGZqch
— Diplomat Times (@diplomattimes) January 19, 2026


