breaking news
bombblast
-
అఫ్గాన్‌లో బాంబుపేలుడు.. ఎగిరిపడ్డ కారు
అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో బాంబుపేలుళ్లు కలకలం రేపుతున్నాయి. షహర్-ఏ-నవ్ ప్రాంతంలో తీవ్రబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు పౌరులు మృతిచెందగా, 13 మంది గాయపడ్డట్లు తాలిబన్ దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే పేలుళ్లు ఏలా జరిగాయి. ఏవరు చేశారనే సమాచారం తెలియాల్సి ఉంది.ఈ దాడులు చైనీస్ ఫుడ్‌కోర్టులు అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగాయి. దీంతో చైనీయులే టార్గెట్‌గా ఈ దాడులు జరిగినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న దర్యాప్తు సంస్థలు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించాయి. కాగా షహర్-ఎ-నవ్ ప్రాంతం అక్కడ ఉండే సురక్షిత ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు అక్కడే పేలుళ్లు జరగడం చర్చనీయాంశమయ్యింది. 🔴BREAKING: Several people were killed and many others injured in a blast in Kabul’s Shahr-e-Naw area, Afghanistan’s Taliban interior ministry said. Afghan Times reports said the explosion occurred in front of a Chinese restaurant. pic.twitter.com/waiVEGZqch— Diplomat Times (@diplomattimes) January 19, 2026 -
ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్ట్
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్లు కేసులో మరో ముందడుగు పడింది. బాంబు పేలుడికి సంబంధించి కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వని అలియాస్ డానిష్ ని ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బాంబు తయారికి సంబంధించిన సాంకేతిక అంశాలు బిలాల్ అందించాడని ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎర్రకోట బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జాసిర్ బిలాల్ వని అలియాస్ (డానిష్)ను ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బిలాల్ బాంబుదాడి జరగడానికి ముందు ఉగ్రవాదులకు సాంకేతిక సహాయం అందించాడని డ్రోన్ల ఆధునీకరణ, రాకెట్ లాంఛర్ల తయారీ వంటి విషయాలలో సహాయం అందించాడని పేర్కొంది. అంతేకాకుండా కారు బాంబు దాడికి ముందు ప్రధాన నిందితుడు ఉమర్‌కు ఎంతో సన్నిహితంగా మెదిలేవాడని పేలుళ్ల కేసులో సహా కుట్రదారుగా బిలాల్ వ్యవహరించాడని తెలిపింది.జాసిర్ బిలాల్ జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లాకు చెందిన వాడని ఎన్ఐఏ తెలిపింది. కాగా ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసులో ఇదివరకే షహీన్ సయీద్, మజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేలుళ్లపై లోతైన విచారణ జరుపుతున్నామని వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయని త్వరలోనే ఢిల్లీ బాంబుపేలుళ్ల కుట్ర కేసును చేధిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. -
మహారాష్ట్రలో మావోల ఘాతుకం: ఏడుగురు పోలీసులు మృతి
మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా పాయిమొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల వాహనాన్నే లక్ష్యంగా పేల్చివేశారు. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందారు. మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మావోల ఘాతుకంపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అలాగే మావోయిస్టుల కోసం గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.


