ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్లు కేసులో మరో ముందడుగు పడింది. బాంబు పేలుడికి సంబంధించి కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వని అలియాస్ డానిష్ ని ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బాంబు తయారికి సంబంధించిన సాంకేతిక అంశాలు బిలాల్ అందించాడని ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎర్రకోట బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జాసిర్ బిలాల్ వని అలియాస్ (డానిష్)ను ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బిలాల్ బాంబుదాడి జరగడానికి ముందు ఉగ్రవాదులకు సాంకేతిక సహాయం అందించాడని డ్రోన్ల ఆధునీకరణ, రాకెట్ లాంఛర్ల తయారీ వంటి విషయాలలో సహాయం అందించాడని పేర్కొంది. అంతేకాకుండా కారు బాంబు దాడికి ముందు ప్రధాన నిందితుడు ఉమర్‌కు ఎంతో సన్నిహితంగా మెదిలేవాడని పేలుళ్ల కేసులో సహా కుట్రదారుగా బిలాల్ వ్యవహరించాడని తెలిపింది.
జాసిర్ బిలాల్ జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లాకు చెందిన వాడని ఎన్ఐఏ తెలిపింది. కాగా ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసులో ఇదివరకే షహీన్ సయీద్, మజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేలుళ్లపై లోతైన విచారణ జరుపుతున్నామని వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయని త్వరలోనే ఢిల్లీ బాంబుపేలుళ్ల కుట్ర కేసును చేధిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.


