ఢాకా: మరణశిక్ష పడ్డ తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇక అప్పగించాల్సిన తరుణం ఏర్పడిందని భారత్‌కు బంగ్లాదేశ్ విన్నవించింది. చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డ వారికి ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు దౌత్యపరంగా సరైనది కాదని బంగ్లా స్పష్టం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ,.. భారత్‌కు లేఖ రాసింది.
మరణశిక్ష పడ్డ షేక్ హసీనా అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. ఇది స్నేహ పూర్వక బాధ్యత అని కూడా బంగ్లాదేశ్ లేఖ ద్వారా స్సష్టం చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తులకు మరే ఇతర దేశం ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు న్యాయం పట్ల నిర్లక్ష్యమే అవుతుందని పేర్కొంది.
కాగా ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్.. షేక్ హసీనాను దోషిగా తేల్చుతూ మరణశిక్ష విధించింది. అల్లర్ల కేసులో ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలపింది. హసీనా మానవత్వాన్ని మరిచిపోయి.. ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారని, ఆమె చేతులో రక్తం నిండిపోయి ఉన్నాయని, అందుకు ఆమెకు మరణశిక్షే సరైనది అంటూ తీర్పు వెలువరించింది.
అయితే హసీనా తొలిసారి స్పందించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుని పేర్కొన్నారు. తనపై కుట్రతో, రాజకీయ దురద్దేశంతో చేసిన కుట్రగా ఆమె అభివర్ణించారు.
ఇదిలా ఉంచితే, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఈ క్రమంలోనే మన దేశానికి దౌత్య సమస్య మరొకటి చేరింది. ఇందులో హసీనా అప్పగింత వ్యవహారం.
గత ఏడాది ఆగస్టు నుంచీ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేయగా, ఆమె మరణశిక్ష పడిన నేపథ్యంలో మరోసారి ‘అప్పగింత’ వ్యవహారంపై బంగ్లాదేశ్ చకచకా పావులు కదుపుతోంది.


