మహారాష్ట్రలో మావోల ఘాతుకం: ఏడుగురు పోలీసులు మృతి | Seven police killed as Maoists trigger bombblast in Gadchiroli district | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో మావోల ఘాతుకం: ఏడుగురు పోలీసులు మృతి

May 11 2014 11:24 AM | Updated on Oct 9 2018 2:51 PM

మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో పాయిమొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల వాహనాన్నే లక్ష్యంగా పేల్చివేశారు.

మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా పాయిమొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల వాహనాన్నే లక్ష్యంగా పేల్చివేశారు. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందారు. మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మావోల ఘాతుకంపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

 

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అలాగే మావోయిస్టుల కోసం గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement