కాబూల్: ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్ ఎ షరీఫ్ సమీపంలో (నేడు) సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు మృతిచెందారని, 150 మంది గాయపడ్డారని, బాధితులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి సమీమ్ జోయాండా ‘రాయిటర్స్’కు తెలిపారు.
CCTV footage shows the moment a strong M6.3 earthquake struck Mazar-e-Sharif, Afghanistan, a short while ago. pic.twitter.com/NX0o04Ggi5
— Weather Monitor (@WeatherMonitors) November 2, 2025
మీడియాకు అందిన వివరాల ప్రకారం దాదాపు ఐదు లక్షల, 23 వేల జనాభా కలిగిన మజార్ ఎ షరీఫ్ సమీపంలో 28 కి.మీ (17.4 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ‘రాయిటర్స్’ ఈ వీడియోలు, ఫొటోలను వెంటనే ధృవీకరించలేదు. గత ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా జనం మరణించారని మానవతా సంస్థ ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్


