బస్సులో మంటలు.. 71 మంది మృతి | 71 Members Died After Afghanistan Bus Carrying Migrants Catches Fire, Watch Video Inside | Sakshi
Sakshi News home page

బస్సులో మంటలు.. 71 మంది మృతి

Aug 20 2025 8:12 AM | Updated on Aug 20 2025 9:37 AM

Afghanistan bus carrying migrants crashes catches fire

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘన్‌లో వలసదారులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో  71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్‌ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన షాకింగ్‌ వీడియోలు బయటకు వచ్చాయి.

వివరాల ప్రకారం.. ఇటీవల ఆప్ఘన్‌ వలసదారులు ఇరాన్‌ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో, వారంతా స్వదేశానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వలసదారులతో వెళ్తున్న బస్సు, మోటారు సైకిల్‌ ఢీకొన్నాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

ఇక, ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా.. అఫ్గాన్‌ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్‌, పాకిస్తాన్‌ (Pakistan) భారీ డిపోర్టేషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్‌, పాకిస్తాన్‌ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగివచ్చారు. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement