Protests In Afghanistan: మాకొద్దు ఈ విద్య అంటూ..సర్టిఫికేట్లను చించేసిన ప్రొఫెసర్‌

Kabul Professor Destroy Diploma Certificates Goes Viral - Sakshi

అఫ్గాన్‌లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన తాలిబన్లు లెక్కచేయకుండా నిరంకుశత్వ ధోరణితో మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో కాబూల్‌ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్‌ అప్గాన్‌ మహిళలపై యూనివర్సిటీ నిషేధానికి వ్యతిరేకంగా తన డిప్లొమా సర్టిఫికేట్లను చించేస్తూ నిరసన తెలిపారు.

నా సోదరి, మా అమ్మ చదుకుకోలేనప్పుడూ నాకు ఈ విద్య వద్దు అంటే ఆ సర్టిఫికేట్లను లైవ్‌ టీవీ ఇంటర్వ్యూలో చించేశారు. ఈ రోజు నుంచి నాకు ఈ చదుకు అవసరం లేదు.  అయినా ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదు అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉండగా,  మహిళలు, మైనారిటీల హక్కులకు సంబంధించి మరి మితవాద పాలనను మొదట్లో వాగ్దానం చేసినప్పటికీ.. తాలిబాన్లు అఫ్గాన్‌ మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకోనివ్వకుండా నిర్వధిక నిషేధాన్ని విధించారు. బాలికలను మిడిల్‌ స్కూల్స్‌కే పరిమితం చేసి, హైస్కూల్‌కి హాజరు కాకుండా నిషేధించారు. అంతేగాదు మహిళలను చాలా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే బహిరంగంగా తల నుంచి కాలి వరకు దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి మహిళలు మగ బంధువులు  లేకుండా ప్రయాణించేందుకు కూడా వీలు లేదు.  

(చదవండి: యూనివర్సిటీల్లో అమ్మాయిలపై నిషేధం.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి అబ్బాయిల నిరసన..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top