
ఆసియా కప్ 2025లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో రేపు (సెప్టెంబర్ 16) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయపడ్డాడు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న నవీన్ ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నవీన్‌కు ప్రత్యామ్నాయంగా అహ్మదుల్లా అహ్మద్‌జాయ్‌ను ప్రకటించింది. ఇదివరకే రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉండిన అహ్మద్‌జాయ్ మెయిన్ జట్టులోకి ప్రమోట్ అయ్యాడు.
కాగా, ఆసియా కప్‌ను ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనర్‌లో హాంగ్‌కాంగ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 దశకు చేరుకుంటుంది.
ఈ టోర్నీలో ఆఫ్గన్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్‌తో పాటు గ్రూప్-బిలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానే గ్రూప్-బి టాపర్‌గా ఉంది. ఆ జట్టు అద్భుతమైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది.
గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో భారత్, పాక్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ ఈ గ్రూప్ టాపర్‌గా ఉంది. పాకిస్తాన్, ఒమన్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. యూఏఈ, ఒమన్ మధ్య మ్యాచ్ 5:30 గంటలకు మొదలైంది. రాత్రి 8 గంటలకు శ్రీలంక, హాంగ్‌కాంగ్ మ్యాచ్ జరుగుతుంది.