బీసీసీఐ, ‍కేంద్రం.. ఆప్ఘన్‌ను చూసైనా సిగ్గుపడాలి: ప్రియాంక చతుర్వేది | Afghanistan Cricket Board Cancels Series With Pakistan After Fatal Airstrike On Cricketers | Sakshi
Sakshi News home page

బీసీసీఐ, ‍కేంద్రం.. ఆప్ఘన్‌ను చూసైనా సిగ్గుపడాలి: ప్రియాంక చతుర్వేది

Oct 18 2025 11:13 AM | Updated on Oct 18 2025 12:49 PM

MP Priyanka Chaturvedi Reacts Afghans call off Pakistan series

ముంబై: పాకిస్తాన్‌ సైన్యం వైమానిక దాడుల కారణంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్లు మృతిచెందారు. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్‌, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్ణయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఏసీబీని చూసి బీసీసీఐ, భారత ప్రభుత్వం నేర్చుకోవాలి అని ఘాటు విమర్శలు చేశారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పాకిస్తాన్ వ్యవస్థలో అమాయక బాధితుల రక్తం తాగే కొందరు వ్యక్తులు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా సిగ్గుపడాలి. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌తో తమ సిరీస్ మ్యాచ్‌లను రద్దు చేసుకోవడం సరైన చర్య. బహుశా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం క్రీడల కంటే దేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఆప్ఘన్‌ నుంచి నేర్చుకోవాలంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సంఘీభావంగా శ్రీలంక జట్టు కూడా సిరీస్ నుండి కూడా వైదొలగాలని ఆశిస్తున్నాను. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు వారి జట్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని మర్చిపోకూడదు. బీసీసీఐ లాగా కాకుండా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇతర ఆసియా జట్లు సంఘీభావంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.

రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలి. ఇక్కడ పోరాటం కేవలం రాజకీయల గురించి మాత్రమే కాదు. దుష్ట దేశం పాకిస్తాన్‌ గురించి. పాక్‌ ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. దేశం అంతా బాధపడుతోంది. కాబట్టి ఇది రాజకీయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ హితవు పలికారు. ఇక, అంతుకుముందు కూడాప్రియాంక బీసీసీఐ, కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత జట్టు మ్యాచ్‌లు ఆడటమేంటని ప్రశ్నించారు. 

ఇదిలా ఉండగా.. క్రికెటర్ల మరణంపై ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘అత్యంత విషాదకరమైన ఘటన. అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్‌ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. విషాద ఘటనలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోన్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరుతున్నా. పాక్‌తో తలపడబోయే ట్రై సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నామని మా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందే. క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తాం. మాకు దేశ సమగ్రత అత్యంత ముఖ్యమైన అంశం’ అని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement