breaking news
Director Kabir Khan
-
కశ్మీర్‌కు వెళ్లిన ప్రతిసారీ ఇంతే..
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్‌ఖాన్ ఇటీవల కశ్మీర్‌కు వెళ్లాడు. అరు అనే గ్రామంలో క్రికెట్ ఆడుతున్న ఓ బాలిక దగ్గరకు వెళ్లి పలకరించాడు.మాటల్లో ‘స్మృతి మంధాన అంటే నాకు ఇష్టం. ఆమెలా ఆడాలనుకుంటున్నాను’ అని చెప్పింది.ఆ బాలిక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి...‘కశ్మీర్‌కు వెళ్లిన ప్రతిసారీ నా కెమెరా ఏదో ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తూనే ఉంటుంది. ఈసారి అద్భుతం... ఆరు గ్రామంలోని బాలిక. తాను భవిష్యత్తులో స్మృతి మంధాన కావాలనుకుంటుంది. స్మృతి ఈ పోస్ట్ చూస్తుందని ఆశిస్తున్నాను’ అని రాశాడు ఖాన్.అతడు ఆశించినట్లే... స్మృతి ఈ పోస్ట్ చూసి సంతోషించింది. ఒక మెసేజ్ ద్వారా ఆ కశ్మీర్ బాలికకు బిగ్ హగ్ ఇచ్చింది! ‘ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని రాసింది.చదవండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేకపోయాంమారుమూల గ్రామాల్లోని పిల్లలకు ఆడాలనే తపన తప్ప, క్రికెట్‌కు సంబంధించి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అయితే వారిలో ప్రతిభ ఉంటే, ఆ ప్రతిభ వారిని ఎక్కడికో తీసుకెళుతుందని చరిత్ర చెబుతూనే ఉంది! -
వారి రొమాన్స్ ఇప్పట్లో చూడలేమా!
ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే, కండలవీరుడు సల్మాన్ ఖాన్ లపై గత కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ లాంటి అగ్రనటులతో స్ర్కీన్ షేర్ చేసుకున్న దీపికా.. సల్మాన్ తో రొమాన్స్ చేయాలని ఆశపడింది. కానీ ఆమె ఆశలు ఇప్పటివరకు తీరలేదు. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ గతంలో సల్మాన్ తో 'ఎక్ థా టైగర్', 'బజరంగీ బాయిజాన్' లాంటి సక్సెస్ ఫుల్ మూవీలను తీశాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడవ సినిమాకు శ్రీకారం చుట్టారు. 'ట్యూబ్ లైట్' అనే టైటిల్ తో ఓ మూవీని కబీర్ తీయనున్నాడు. ఇందులో సల్మాన్ కు జోడీగా దీపికా కనిపించనుందని ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం లేదని ఓ బాలీవుడ్ వెబ్సైట్ తేల్చేసింది. కథ, హీరోహీరోయిన్ల విషయంలో కబీర్ చాలా కఠినంగా ఉంటాడు. క్రేజీ కాంబినేషన్లు అంటూ వాటి జోలికెళ్లకుండా కేవలం పనిని నమ్ముకుని పనిచేసే దర్శకుడు ఆయన. అందుకే బాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు దీపికా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా ఈ కాంబినేషన్ పై కబీర్ ఇష్టం చూపలేదట. 1960 దశకంలో ఇద్దరు సోదరుల వాస్తవకథనే 'ట్యూబ్ లైట్' రూపంలో తెరకెక్కించనున్నాడు కబీర్. హీరోయిన్ ఎంపిక కోసం కబీర్ చాలా ఆడిషన్స్ నిర్వహించడంతో దీపికాకు అవకాశం లేదన్న విషయం వెల్లడైంది. -
ఇండో-చైనీస్ సినిమాలో...
సల్మాన్‌ఖాన్ వచ్చే రంజాన్‌కు ‘సుల్తాన్’ చిత్రంతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘సుల్తాన్’ తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. అది ఇండో-చైనీస్ చిత్రం కావడం విశేషం. రిలీజ్ డేట్‌తో పక్కాగా ఈ సినిమా గురించి ప్రకటించేశారు కూడా. ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకున్న ‘బజ్రంగీ భాయీజాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెర కెక్కించనున్నారు. భారత్ నుంచి చైనా ప్రయాణంలో ఓ యువకునికి ఎదురైన అనుభవాలతో ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందనుందట. ఇందులో దీపికా పదుకొనేతో పాటు ఓ చైనీస్ బ్యూటీతో కలసి సల్మాన్‌ఖాన్ రొమాన్స్ చేయనున్నారని సమాచారం. సల్మాన్‌ఖాన్, కబీర్‌ఖాన్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చే యనున్నారు.


